పవన్ - ప్రభాస్.. హైప్ తో పోతారేమో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కి సంబందించిన సన్నివేశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. త్వరలో వీటిని పూర్తి చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోంది.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ‘ఓజీ’ మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ వస్తుందని అంటున్నారు.
సుజిత్ ప్రభాస్ తో ‘సాహో’ మూవీ చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతోనే ఈ సినిమాని సుజిత్ తెరకెక్కించారు. అయితే ‘బాహుబలి 2’ తర్వాత రావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ని ‘సాహో’ అందుకోలేకపోయింది. ఇక ‘ఓజీ’, ‘సాహో’ చిత్రాలని మల్టీవర్స్ గా సుజిత్ డెవలప్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు. గతంలోనే ఈ ప్రచారం ఒకసారి జరిగింది.
మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే ఫ్రేమ్ లో స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులకి పూనకాలు వచ్చేస్తాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ హైప్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ని పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ వచ్చింది.
కచ్చితంగా ఈ క్రేజ్ అతని సినిమాలకి హెల్ప్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే ప్రభాస్, పవన్ కళ్యాణ్ కటౌట్స్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఈ ప్రచారంపై మేకర్స్ ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. ‘ఓజీ’లో ఇంకో హీరో కూడా ఉన్నాడనే వార్త బయటకి రావడంతో అతను ప్రభాస్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.