OG పనిలో త‌మ‌న్.. `గేమ్ ఛేంజ‌ర్` కంటే ముందు?

ఎస్.ఎస్.త‌మన్ నేటిత‌రంలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కొన‌సాగుతున్నారు.

Update: 2024-09-27 10:01 GMT

ఎస్.ఎస్.త‌మన్ నేటిత‌రంలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కొన‌సాగుతున్నారు. తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల‌లో చెప్పుకోగ్గ భారీ చిత్రాల‌కు అత‌డు ప‌ని చేస్తున్నాడు. ముఖ్యంగా శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న గేమ్ ఛేంజ‌ర్, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీ చిత్రాల‌కు అత‌డు ప‌ని చేస్తుండ‌డంతో మెగాభిమానుల్లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. థ‌మ‌న్ మ్యూజిక్ ప‌రంగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు? అన్న‌ది చ‌ర్చ‌గా మారింది. రీరికార్డింగ్ ప‌రంగా థ‌మ‌న్ ది బెస్ట్ ఇస్తాడ‌నే న‌మ్మ‌కం ఉన్నా కానీ అత‌డు అందించే పాట‌ల‌పైనే కొంత అసంతృప్తి ఉంది. ఇటీవ‌లి కాలంలో అల వైకుంఠ‌పుర‌ములో త‌ర‌హా మ్యాజిక్ ని రిపీట్ చేయ‌డంలో అత‌డు త‌డ‌బ‌డుతున్నాడు.

రామ్ చ‌ర‌ణ్‌ `గేమ్ ఛేంజ‌ర్` కోసం ఇచ్చిన `జ‌ర‌గండి..` సింగిల్ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. థ‌మ‌న్ రొటీన్ ట్యూన్ తో స‌రిపెట్టాడు అంటూ మెగాభిమానులే పెద‌వి విరిచేసారు. థ‌మ‌న్ పై సోష‌ల్ మీడియాల్లో తీవ్ర‌మైన ట్రోలింగ్ జ‌రిగింది. ఇదిలా ఉండ‌గానే గేమ్ ఛేంజ‌ర్ నుంచి రెండో సింగిల్ లాంచింగ్ కి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఆయా భాష‌ల కోసం అనంత శ్రీరామ్, వివేక్ వేల్మురుగన్, కుమార్ రచించిన రెండో పాట `రా మ‌చ్చ మ‌చ్చా..` ప్రోమో సెప్టెంబర్ 28 న విడుదల కానుంది. పూర్తి పాట సెప్టెంబర్ 30 న అందుబాటులో ఉంటుంది. వివిధ భారతీయ రాష్ట్రాల నుండి 1000 మంది జానపద నృత్యకారులతో పాటు రామ్ చరణ్‌తో కలిసి అభిమానులకు విజువల్ ఫీస్ట్ ని పంచే పాట ఇద‌ని చెబుతున్నారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాట గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌. నకాష్ అజీజ్ మూడు భాషలలో (తెలుగు, తమిళం, హిందీ) పాడారు. భారతదేశ గొప్ప సంస్కృతికి నివాళిగా ఈ పాట వివిధ ప్రాంతాల నుండి జానపద నృత్యాల స‌ర‌ళిని ప్రదర్శిస్తుంది:

ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు ఎస్.ఎస్.థ‌మ‌న్ త‌న త‌దుప‌రి సినిమా ఓజీ గురించి కూడా అప్ డేట్ అందించారు.

ఇటీవల OG కోసం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) రవి కె చంద్రన్, పవన్ కళ్యాణ్‌తో దిగిన‌ సెల్ఫీని పోస్ట్ చేయడంతో ప‌ని తిరిగి మొద‌లైంద‌నే సంకేతాలు అందాయి. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సర్‌తో ఒక సెల్ఫీ, త్వరలో #OGని రీబూట్ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నాను అని అత‌డు ట్వీట్ చేశాడు. డియ‌ర్ డివోపి 007.. విజ‌య‌వాడ‌లో క‌లుసుకుందాం...నా స్టూడియో టీమ్ తో పాటుగా.. చాలా ఎగ్జ‌యిటింగ్ గా ఉంది! అంటూ దీనికి ట్యాగ్ ని జోడించాడు త‌మ‌న్. దీనిని బ‌ట్టి ఓజీ టెక్నిక‌ల్ టీమ్ అంతా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ని తిరిగి షూటింగ్ మొద‌లు పెట్ట‌మ‌ని, వెంట‌నే పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించాల‌ని కోరుతున్న‌ట్టు అర్థం చేసుకోవ‌చ్చు. ఓజీ చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌గా పూర్త‌యి థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టే ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ వేగం పెంచుతార‌నే భావిస్తున్నారు.

Tags:    

Similar News