ఆ విష‌యంలో ప‌వ‌న్‌ని ఆప‌లేమ‌న్న సుజీత్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా జ‌న‌సేనాని హోదాలో నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో ఉన్నారు. ఎన్నిక‌లు ముగిసాయి

Update: 2024-05-27 04:58 GMT

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా జ‌న‌సేనాని హోదాలో నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో ఉన్నారు. ఎన్నిక‌లు ముగిసాయి. ఫ‌లితాల‌కు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. దీనికి ముందు ఈ తీరిక స‌మ‌యాన్ని ఆయ‌న దేనికోసం స‌ద్వినియోగం చేస్తున్నారు? అంటే.. చిత్రీక‌ర‌ణ‌లు చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ సినిమాల‌ను పూర్తి చేయ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసార‌ని తెలిసింది.

ఇప్ప‌టికే సుజీత్ తెర‌కెక్కిస్తున్న‌ OG పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా పనిని మళ్లీ ప్రారంభించనున్నారు. ఓ ఇంటర్వ్యూలో సుజీత్ సినిమాలోని ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. సుజీత్‌ మాట్లాడుతూ.. ఓజీలో ఐకిడో (మార్షల్‌ ఆర్ట్స్‌) సీక్వెన్స్‌ ఉంటుంది. నాకు ఉన్న ప‌రిజ్ఞానం అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా నేను దీన్ని రూపొందించాల‌నుకున్నాను. కానీ కళ్యాణ్ గారు తన బెస్ట్ ఇవ్వాలనుకున్నారు. ఆయ‌న‌ పూణే -ముంబై నుండి ఐకిడో మాస్టర్స్‌ని సంప్రదించారు. అనేక ప్రాక్టీస్ సెషన్‌లు చేసారు. కొన్ని యూట్యూబ్ వీడియోలను కూడా చూశారు. దానిని ఎలా వ‌ర్క‌వుట్ చేయాలో నాతో చర్చించారు. అతని ఇన్‌పుట్‌లతో మేము యాక్షన్ బ్లాక్‌ని రీడిజైన్ చేసి మూడు రోజుల్లో చిత్రీకరించాం. ఇంతకుముందు ప్లాన్‌ని సగం రోజులో ముగించాల‌నుకున్నాం.. కానీ కళ్యాణ్ గారికి ఇంటరెస్టింగ్‌గా అనిపిస్తే ఆయన్ను ఆపేది లేదు`` అని తెలిపాడు.

ఓజీతో ఇమ్రాన్ హ‌ష్మి తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నాడు. ఓమి బాబా అత‌డి పాత్ర పేరు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, తేజ్ సప్రు, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ త‌దిత‌రులు నటిస్తున్నారు. థమన్ ఎస్.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News