పవన్ కళ్యాణ్.. ఈ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా!
మొన్నటివరకు ఒక లుక్ లో ఉన్న పవన్ ఇప్పుడు సడన్ గా స్టైలిష్ లుక్ లోకి మారిపోయారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సంబంధిత శాఖల అధికారులతో వరుస రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తూ, గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధుల విడుదలపై వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక అవకతవకలపై దృష్టి సారించారు. ఈ విధంగా పవన్ ప్రజానాయకుడిగా ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు.
పవన్ కళ్యాణ్ హిందూ సాంప్రదాయ ఆచారాలు పాటించడం తెలిసిందే. మొన్నటివరకు ఒక లుక్ లో ఉన్న పవన్ ఇప్పుడు సడన్ గా స్టైలిష్ లుక్ లోకి మారిపోయారు. పవన్ ప్రతి ఏడాది పవన్ చాతుర్మాస దీక్ష చేస్తుంటారు. ఇటీవల వారాహి దీక్షలో నిమగ్నమయిన విషయం తెలిసిందే. ఈ దీక్ష 11 రోజుల పాటు చేశారు. దీక్ష సమయంలో పవన్ కేవలం పండ్లు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. నేలపైన నిద్రించడం వంటి కఠిన నియమాలు పాటించారు.
పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రచారంలో "వారాహి" అనే వాహనాన్ని ఉపయోగించారు. ఈ యాత్ర విజయవంతంగా ముగియడం, కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కీలక పాత్ర పోషించడం పవన్ కళ్యాణ్ దీక్షకు కారణమని చెప్పవచ్చు. పవన్ ఈ విజయాన్ని వారాహి మాత ఆశీర్వాదంగా భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండేందుకు పవన్ ఈ దీక్ష తీసుకున్నారని వినిపిస్తోంది.
ఇక దీక్ష అనంతరం పవన్ మళ్ళీ తన మునుపటి స్టైల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల సతీమణి అన్నాతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఆయన బ్లాక్ కలర్ షార్ట్, బ్రౌన్ కలర్ ప్యాంట్ లో చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చారు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బాధ్యతలతో నిమగ్నమై ఉన్నారు.
ఇక రాబోయే రోజుల్లో షూటింగ్స్ లతో కూడా పవన్ బిజీ అవ్వనున్నారు. ప్రస్తుతం OG - హరి హర వీరమల్లు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. ముందుగా OG సినిమా పై ఫోకస్ చేయనున్న పవన్ ఒక రెండు వారాలు షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే హరిహర వీరమల్లు కూడా ఇదే ఏడాది లో ఫినిష్ కావాల్సి ఉంది. మరి పవన్ ఆ సినిమాల కోసం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.