OG - అంతా బాగానే ఉంది.. కానీ..
ఇటీవల యువ దర్శకుడు సుజిత్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న OG సినిమాకు సంబంధించిన చాలా విషయాలు వెల్లడించడం చర్చనీయాంశమవుతోంది
ఇటీవల యువ దర్శకుడు సుజిత్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న OG సినిమాకు సంబంధించిన చాలా విషయాలు వెల్లడించడం చర్చనీయాంశమవుతోంది. సుజిత్ ఇచ్చిన వివరాల వల్ల ఈ సినిమా మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కానీ ఈ వివరణలు ఫ్యాన్స్‌లో కొంత ఆందోళనను కలిగిస్తున్నాయి. సుజిత్, పవన్ కల్యాణ్ ఈ చిత్రానికి ప్రత్యేకంగా క్రవ్ మగా అనే మార్షల్ ఆర్ట్ శిక్షణ తీసుకున్నారని, సినిమాకి అవసరమైన ప్రత్యేక సన్నివేశాలను షూట్ చేసేందుకు ఎంతగానో శ్రమించారని వివరించారు.
ఈ వివరణలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. కానీ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నది ఒకటే - ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో అని. మొదటగా ఈ సినిమాను 2023 సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయాలలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నందున, జనసేన అధ్యక్షుడు రాష్ట్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
అలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్లీ సినిమా సెట్స్‌కి ఎప్పుడు వస్తారు? షూట్ ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చోటు పొందితే, షూటింగ్‌కి తిరిగి రావడానికి 3-4 నెలలు పడవచ్చు. తర్వాత మరో రెండు నెలలపాటు షూటింగ్ పూర్తి చేయవలసి ఉంటుంది. అందువల్ల OG సినిమా విడుదలకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు.
ఈ విధంగా చూస్తే పవన్ కల్యాణ్ అభిమానులకు త్వరలోనే OG సినిమా థియేటర్లో చూడటానికి అవకాశం ఉండకపోవచ్చు. సినిమా ఆలస్యం అయినా కూడా పవన్ తన సినిమాపై చూపిస్తున్న శ్రద్ధ, క్రవ్ మగా వంటి ప్రత్యేక శిక్షణలు తీసుకున్నటువంటి విధానం అభిమానులలో అంచనాలు పెంచుతోంది. ఇక పవన్ కల్యాణ్ రాజకీయ పరిస్థితులు, సినిమాకు సంబంధించిన అనేక అంశాలు ఎటువంటి ప్రాభావం చూపుతాయో చూడాలి.
సుజిత్ చెప్పిన వివరాలు అయితే ఫ్యాన్స్ లో ఎంతో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో యాక్షన్ డోస్ అయితే మాములుగా ఉండదని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ గా పవన్ OG లో కనిపించబోతున్నాడు. ఇక సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి థమన్ ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి.