వీరమల్లు టీంకి పవన్ ఏం చెప్పినట్లు?
ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సెట్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడుస్తోంది.
ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సెట్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడుస్తోంది. ఇంతకాలం రాజకీయం..ప్రభుత్వం పనుల్లోనే పీకే బిజీ అయ్యారు. దీంతో మరికొద్ది రోజుల్లో బ్యాక్ టూ షూట్ అంటూ సెట్స్ కి రాబోతున్నారు. ఇప్పటికే `ఓజీ` కోసం కొన్ని డేట్లు కేటాయించారు. పవన్ గ్యాప్ తీసుకోకుండా కొన్ని రోజుల పాటు షూట్ కి హాజరైతే చిత్రీకరణ పూర్తవుతుంది. అటుపై `ఓజీ` టీమ్ మిగతా పనుల్లో నిమగ్నమవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా సమయం ఎక్కువగానే పడుతుంది. ఆ పనుల్ని బట్టి రిలీజ్ కి ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే `ఉస్తాద్ భగత్ సింగ్` టీమ్ కూడా పీకేని కలిసింది. కొన్ని నెలలుగా పీకేకి దూరంగా ఉన్న టీమ్ పవన్ డేట్లు గురించి చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో పవన్ అంతకంటే ముందు `హరి హర వీరమల్లు `పూర్తి చేయాలి అన్న సంగతి ఆ టీమ్ వద్ద ప్రస్తావిం చినట్లు తెలిసింది.
సరిగ్గా ఇదే సమయంలో వీరమల్లు టీమ్ కూడా పవన్ ని కలిసింది. జ్యోతికృష్ణ, ఏ.ఎం రత్నం, నిర్మాత దయాకరరావు, కెమెరా మెన్ మనోజ్ పరమహంస కలిసారు. అనంతరం డేట్లు గురించి అడిగినట్లు సమాచారం. `ఓజీ`తో పాటు వీరమల్లు కి కూడా డేట్లు కేటాయించాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు పవన్ కూడా సానుకూలంగానే స్పందించారుట. మరి డేట్లు ఎప్పటి నుంచి ఇచ్చారు? అన్నది తెలియాల్సి ఉంది. `వీరమల్లు` ఓజీ కంటే ముందుగానే ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కానీ పెద్ద ప్రాజెక్ట్ కావడం..రిలీజ్ కి ఎ క్కువ సమయం పడుతుందని భావించి సుజిత్ తో `ఓజీ`ని పట్టాలె క్కించారు. ఆ తర్వాత రాజకీయంగా సమీకరణాలు మారడంతో ఎన్నికలకు ముందు ఏ సినిమా రిలీజ్ చేయలేకపోయారు.