పవన్.. మళ్ళీ లైన్ లోకి వచ్చేది అప్పుడే..
ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రసుత్తం శరవేగంగా జరుగుతోంది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టారు. అయితే పవన్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఓజీ ఒకటి. సాహో ఫేమ్ సుజిత్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రసుత్తం శరవేగంగా జరుగుతోంది.
ఈ మూవీలో వైలెంట్ గ్యాంగ్స్టర్ రోల్ లో పవర్ స్టార్ కనిపించనుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకులతోపాటు సినీ లవర్స్.. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గ్లింప్స్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి చేరాయి. 1990 నాటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇటీవల ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.
తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఓజీ నిర్మాత డీవీవీ దానయ్య.. మూవీ రిలీజ్ పై మరింత క్లారిటీ ఇచ్చారు. ఓజీ సినిమా కచ్చితంగా చెప్పిన డేట్ కే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. ఏప్రిల్ నెలలో ఏపీ ఎన్నికల అనంతరం పెండింగ్ ఉన్న షూటింగ్ ను పవన్ కంప్లీట్ చేస్తారని చెప్పారు. పాన్ ఇండియా రేంజ్ లో ఓజీ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
అయితే ఏపీ ఎన్నికలకు, ఫలితాలకు మధ్య నెల రోజుల గ్యాప్ ఉంటుందట. ఈ గ్యాప్ లోనే పవన్ తన బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేయనున్నారట. దీంతో ఎన్నికలు ముగిసిన వెంటనే షూటింగ్ లో పాల్గొనున్నారట. ఫలితాలు ప్రకటించకముందే షెడ్యూల్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ మూవీలో పదేళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉండి.. మళ్లీ వచ్చి శత్రువులను పవన్ అంతం చేస్తారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఓజీ మూవీలో పవన్, ప్రియాంకతో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ చేస్తున్నారు. విలన్ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రసాఖ్ రాజ్, శ్రియా రెడ్డి, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఓజీ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.