పెగ్గేసి నిద్రమాత్రలు మింగనిదే నిదురే రాదన్న నటి!
అయితే కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి తన ఇన్ స్టా మాధ్యమంలో పాయల్ ఘోష్ తనకు ఎదురైన వేధింపుల గురించి ప్రస్థావించింది.
మీటూ ఉద్యమంలో ప్రముఖంగా వినిపించిన పేర్లలో పాయల్ ఘోష్ పేరు కూడా ఉంది. ఇర్ఫాన్ ఫటాన్, గౌతమ్ గంబీర్ తనను నిరంతరం వెంటాడేవారని ఆరోపించిన ఈ బ్యూటీ అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేసాడని కూడా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు అప్పట్లో సంచలనమే అయ్యాయి.
కొన్ని తెలుగు, హిందీ సినిమాలలో కనిపించిన పాయల్ ఘోష్ ICC ప్రపంచ కప్ 2023 సందర్భంగా టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని వివాహం చేసుకోవాలని తన కోరికను వ్యక్తం చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో పాయల్ మాజీ క్రికెటర్లపై కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది. ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్ తనకు ఫోన్లు చేసేవారని పాయల్ అన్నారు. అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. అదే సమయంలో సహనటుడు అక్షయ్ కుమార్‌ను ప్రశంసించింది.
తాను గతంలో ఇర్ఫాన్ పఠాన్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసి, ఆ తర్వాత విడిపోయామని పాయల్ పేర్కొంది. గౌతమ్ గంభీర్ కూడా తనను వెంబడించాడని, అయితే తాను ఇర్ఫాన్ పఠాన్‌తో గాఢంగా ప్రేమలో ఉన్నానని ఆమె తెలిపింది. తాను ప్రతి విషయాన్ని ఇర్ఫాన్‌కి చెప్పేదానిని అని.. గౌతమ్ గంభీర్ నుండి తనకు తరచుగా మిస్డ్ కాల్స్ వచ్చేవని కూడా పాయల్ పేర్కొంది. దేశవాళీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పూణెలో ఇర్ఫాన్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు యూసుఫ్ పఠాన్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాల ముందు ఈ విషయం మాట్లాడానని పాయల్ చెప్పింది.
ఇర్ఫాన్ నుంచి విడిపోయిన తర్వాత ... నేను అనారోగ్యం పాలయ్యాను .. చాలా సంవత్సరాలు పని చేయలేకపోయాను ... కానీ నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి అతడు మాత్రమే... ఆ తర్వాత నేను ఎవరినీ ప్రేమించలేదు.. అని పాయల్ తెలిపింది. అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేశాడని, అయితే అక్షయ్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని పాయల్ పేర్కొంది. 2014లో అనురాగ్ తన ముందు బట్టలు విప్పి వేధించడానికి ప్రయత్నించాడని పాయల్ పేర్కొంది. అయితే పాయల్ తనపై చేసిన లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలన్నింటినీ కశ్యప్ కొట్టిపారేశాడు.
మరోసారి పాయల్ తీవ్ర ఆరోపణలు:
అయితే కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి తన ఇన్ స్టా మాధ్యమంలో పాయల్ ఘోష్ తనకు ఎదురైన వేధింపుల గురించి ప్రస్థావించింది. తాను నిదుర మాత్రలు మింగనిదే, ఒక గ్లాస్ వైన్ తాగనిదే ఇప్పటికీ నిదురపోలేనని పాయల్ వెల్లడించింది. అనురాగ్ కశ్యప్ తనను అత్యాచారం చేసాడని, తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లానని కూడా పాయల్ పేర్కొంది. కొన్నేళ్లుగా యాంటీ డిప్రసెంట్ మందులు వాడుతున్నానని వాటి వల్ల ట్రామాలోకి వెళ్లానని కూడా వెల్లడించింది. అంతేకాదు అనురాగ్ కశ్యప్ కి కూతురు ఉంది. తను కూడా నాలాగే అత్యాచారానికి గురవుతుందని కూడా పాయల్ ఘోష్ వేరొక ఇన్ స్టా పోస్ట్ లో అనురాగ్ ని శపించింది. బెంగాళీ బ్యూటీ పాయల్ ఘోష్ తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి చిత్రంలో నటించింది. మంచు మనోజ్ సరసన `ప్రయాణం` అనే చిత్రంలోను ఆడిపాడింది.