కల్కి 2898AD: ఈ టైమ్ లో ట్రైలర్ అంటే.. పెద్ద ఛాలెంజే..

ఇదిలా ఉంటే జూన్ 10న కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమాపై హైప్ క్రియేట్ అయ్యి మొదటి రోజు పబ్లిక్ థియేటర్స్ కి వచ్చేలా చేయడంలో ట్రైలర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి.

Update: 2024-06-09 05:14 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా కల్కి 2898ఏడీ థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. సినిమా నుంచి బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ ని రిలీజ్ చేశారు.

దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే బుజ్జి పేరుతో అడ్వాన్స్ మోడల్ కారుని కల్కి మూవీ కోసం డిజైన్ చేశారు. ఈ కారుని ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే జూన్ 10న కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమాపై హైప్ క్రియేట్ అయ్యి మొదటి రోజు పబ్లిక్ థియేటర్స్ కి వచ్చేలా చేయడంలో ట్రైలర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి.

సినిమా కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ ను సాలీడ్ గా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కల్కి ట్రైలర్ ని జూన్ 10 న రిలీజ్ చేయడం కరెక్టేనా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి కారణం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పొలిటికల్ బజ్ నడుస్తోంది. పబ్లిక్ అంతా కూడా ఆ పొలిటికల్ మూడ్ లోనే ఉన్నారు. మరో వైపు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తి రామోజీరావు చనిపోయారు. అతని కోసం ఏపీలో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. అలాగే కేంద్రంలో ప్రధానిగా ప్రమాణస్వీకారం, క్యాబినెట్ ప్రకటనపైన మీడియా ఫోకస్ ఉంది.

ఏపీలో కూడా చంద్రబాబు ప్రమాణస్వీకారం జూన్ 12న ఉంది. మరో వైపు ఏపీలో టీడీపీ తమ కార్యకర్తలపై దాడులకి తెగబడుతుందని వైసీపీ ఆందోళనలు చేస్తోంది. సోషల్ మీడియా మొత్తం ఏపీ రాజకీయాలపైనే చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఇలానే నెల రోజులు కొనసాగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతని ప్రమాణస్వీకారం, అలాగే డిప్యూటీ సీఎం అంటున్నారు.. అది ఇవ్వకపోయినా రచ్చే.. ఇక పవన్ తీసుకునే మొదటి నిర్ణయాలు కూడా కీలకం కానున్నాయి. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ఫోకస్ పాలిటిక్స్ పైనే ఎక్కువగా ఉంది.

ఇలాంటి సమయంలో కల్కి 2898 ఏడీ ట్రైలర్ రిలీజ్ చేస్తే ఏ స్థాయిలో పబ్లిక్ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుందనేది చెప్పలేని విషయం. కల్కి లాంటి పాన్ వరల్డ్ చిత్రానికి ఈ ట్రైలర్ బజ్ చాలా ముఖ్యం. ఏ మాత్రం పబ్లిక్ అటెన్షన్ ట్రైలర్ పై లేకపోయిన సినిమాని జనాల్లోకి అగ్రెసివ్ గా తీసుకొని వెళ్ళలేరు. మరి దీనిపై కల్కి టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే కల్కి మూవీలో దీపికా పదుకునే, దిశా పటాని ప్రభాస్ కి జోడీగా నటించారు. అమితాబచ్చన్, కమల్ హాసన్ లాంటి అగ్ర నటులు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.

Tags:    

Similar News