బుట్ట బొమ్మ అలా న‌డిచొస్తుంటే...!

ముఖ్యంగా పూజా థై స్లిట్ ఎల్లో డ్రెస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారుతోంది.

Update: 2024-09-19 22:30 GMT

అవును.. బుట్ట బొమ్మ అలా న‌డిచొస్తుంటే గుండె గ‌ల్లంత‌వ్వాల్సిందే. 'అల వైకుంఠ‌పుర‌ములో' అల‌ వైబ్స్ ఇప్ప‌టికీ పూజాను విడిచి దూరంగా పోలేదు. అదే రూపం కుర్ర‌కారు మ‌దిలో మెదులుతూనే ఉంది. అంత‌గా ప్ర‌భావం చూపిన పాత్ర‌ను క్రియేట్ చేసిన త్రివిక్ర‌ముడిని ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. క‌థానాయిక‌ల‌ను కేవ‌లం గ్లామ‌ర్ డాళ్స్ గా మాత్ర‌మే చూపించే ప‌రిశ్ర‌మ‌లో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో పూజాకు బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాలు క‌ల్పించాడు అత‌డు.

అర‌వింద స‌మేత‌-అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల‌తో పూజా స్థాయిని పెంచాడు. అదంతా అటుంచితే పూజా హెగ్డే ఇటీవ‌ల ఏ ఈవెంట్లో క‌నిపించినా థై స్లిట్ డ్రెస్ లో దుమ్ము రేపుతోంది. అవే పొడుగు కాళ్లు.. కాలి సౌంద‌ర్యం ఆవిష్క‌రించే థై స్లిట్ డ్రెస్ లు.. త‌న అందాన్ని మ‌రింత‌గా ఆవిష్క‌రిస్తున్నాయి. ఇప్పుడు ఓ కార్పొరెట్ ఉత్ప‌త్తికి ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పూజా అలా అలా న‌డిచొస్తుంటే క‌ళ్ల‌న్నీ త‌న‌వైపు వాలిపోయాయి. అంత ల‌య‌బ‌ద్దంగా క‌దిలి వ‌స్తున్న హంపీ శిల్పాన్ని క‌నులారా చూస్తూ ఉండిపోయారు. ముఖ్యంగా పూజా థై స్లిట్ ఎల్లో డ్రెస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారుతోంది.

పూజా హెగ్డే కెరీర్ ఇటీవ‌ల టాలీవుడ్ లో డ‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్ క‌పూర్ స‌ర‌స‌న 'దేవా' అనే యాక్ష‌న్ చిత్రంలో న‌టిస్తోంది. ఆ త‌ర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్ర‌క‌టించ‌లేదు. కంబ్యాక్ కోసం టాలీవుడ్, కోలీవుడ్ లో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో మంత‌నాలు సాగిస్తోంద‌ని టాక్ ఉంది. త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి పూజా వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది.

Tags:    

Similar News