బుట్ట బొమ్మ ఈ సారి పక్కా ప్లానింగ్ తో..!
ఒకప్పుడు గ్లామర్ కే ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేసిన అమ్మడు ఇప్పుడు నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా చేయాలని భావిస్తుంది.
బుట్ట బొమ్మ పూజా హెగ్దేని టాలీవుడ్ దూరం పెట్టినా కూడా మొన్నటిదాకా ఒకటి రెండు అవకాశాలతో సరిపెట్టుకున్న అమ్మడు ఇప్పుడు ఏకంగా ఐదారు సినిమాలతో బిజీ బిజీగా మారింది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో దేవా సినిమా చేస్తున్న అమ్మడు ఆ సినిమా తర్వాత రెండు ఆఫర్లను పట్టేసింది. ఇక కోలీవుడ్ లో దళపతి విజయ్ సినిమాతో పాటుగా సూర్య రెట్రోలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో అక్కడ కూడా మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది అమ్మడు.
పూజా హెగ్దే ఈసారి పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేస్తుందని అనిపిస్తుంది. ఒకప్పుడు గ్లామర్ కే ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేసిన అమ్మడు ఇప్పుడు నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలను కూడా చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే తన సినిమాల అవకాశాల గురించి రీసెంట్ గా మాట్లాడింది. తన కెరీర్ సంతృప్తికరంగా ఉందని అంటున్న అమ్మడు. పాత్రల ఎంపిక కాదు అందులో జీవించడం ముఖ్యమని అంటుంది. అంతేకాదు ప్రొఫెషనల్ గా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉన్నా అంటుంది పూజా.
సినిమాలో పూజా హెగ్దే ఉంది అంటే గ్లామర్ షో తప్పనిసరి అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అలాంటిది అమ్మడు పాత్ర ప్రాధాన్యత ఉంటేనే గ్లామర్ షో చేస్తానని అంటుంది. అది కొంతమేరకు మంచిదే అయినా అమ్మడి థై షోకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్లని నిరాశ పరచకుండా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. తెలుగులో ఒకటి రెండు సినిమాల డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తున్నా వాటిలో ఏది ఫైనల్ అవ్వలేదు.
తెలుగులో మొన్నటిదాకా స్టార్ సినిమా అయితే ఆమె ఫస్ట్ ఆప్షన్ అనిపించగా ఇప్పుడు అమ్మడు తిరిగి మళ్లీ అలాంటి ఛాన్స్ లు పొందేందుకు చాలా కష్టపడుతుంది. మరి పూజా బేబీ పెడుతున్న ఈ ఎఫర్ట్స్ అమ్మడికి ఏమేరకు ఫలితాన్ని అందిస్తాయన్నది చూడాలి. పూజా హెగ్దే గ్లామర్ కాకుండా యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ సినిమాలేమో కానీ తమిళ్ లో పూజా చేస్తున్న రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి కాబట్టి వాటితో పూజా అక్కడ తిరిగులేని క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.