వెజ్-నాన్ వెజ్ కలిపి కుమ్మేస్తోన్న బుట్టబొమ్మ!
వెజ్-నాన్ వెజ్ అన్నిరకాల వంటకాల్ని కలిపి కుమ్మేస్తోంది.
ముంబై బ్యూటీ పూజాహెగ్డే వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మడు వెకేషన్ ఫోటోలు నెట్టింట షేర్ చేసింది. సోలోగా జంగిల్ రిసార్స్ట్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ప్రతీమూవ్ మెంట్ ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అమ్మడు మరో పిక్ రిలీజ్ చేసింది. ఇందులో సొగసరి కడుపు నింపే కార్యక్రమంపై దృష్టి పెట్టింది. వెజ్-నాన్ వెజ్ అన్నిరకాల వంటకాల్ని కలిపి కుమ్మేస్తోంది.
ఎదురుగా ఇష్టమైన వంటకాలన్నింటిని ముందుపెట్టుకుని ఆరగిస్తుంది. పెద్ద డైనింగ్ టేబుల్ పై ఆహార పదార్దాలను ఇక్కడ చూడొచ్చు. వైట్ రైస్...పాపడ్, పీతల కర్రీ, రోటీ, వివిధ రకాల ప్రైలు అన్నింటిలోనూ కరివేపాకు దట్టించి మరీ ప్రిపేర్ చేయించుకుంది. అన్నింటిని రుచి వరకూ పరిమితం చేసింది. పూజాహెగ్డే ఇంతవరకూ ఎప్పుడూ ఇలా కనిపించలేదు.
తొలిసారి ఓ పెద్ద ప్లేటులో భుజించడం ఇదే తొలిసారి కావచ్చు. ఇలా ఇన్నిరకాల వంటకాలు రుచి చూసే అమ్మడైతే? ప్రభాస్ ఇంట వంటకాలు కూడా రుచి చూసే ఉండాలి కదా. ఇద్దరు కలిసి రాధేశ్యామ్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలో నటించిన హీరోయిన్లకు తన ఇంటి భోజనం ఇవ్వడం..ఆయనకు నచ్చిన అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు వండి ఇవ్వడం ఓ అలవాటు.
ఇప్పటి వరకూ తనతో పనిచేసిన హీరోయిన్లు అందరికీ తన రుచులు చూపించాడు. మరి అందులో పూజాహెగ్డే ఉందా? లేదా? తెలియాలి. ప్రభాస్ రుచులు చూసిన వారంతా ప్రచార సమయంలో రివీల్ చేసారు. కానీ పూజాహెగ్డే మాత్రం ఎక్కడా ఈ సంగతి చెప్పలేదు.