పూజా విషయంలో సీన్ రివర్స్ జరుగుతుంది..!
పూజానే కావాల ని తెలుగు ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తుందని టాక్.
బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి తెలుగు సినిమా అవకాశాలు రావట్లేదు. అమ్మడి టాలీవుడ్ కెరీర్ ముగిసినట్టే కమిటైన సినిమాల నుంచి కూడా ఆమెను తీసేస్తున్నారు అంటూ మీడియా లో ప్రచారం తెలిసిందే. పూజా హెగ్దే కి ఆఫర్లు రావడం లేదు దాదాపు అమ్మడు పని అయిపోయినట్టే అని చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పూజానే కావాల ని తెలుగు ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తుందని టాక్. అదేంటి తనకు స్టార్డమ్ తెచ్చిన టాలీవుడ్ ఛాన్స్ లు పూజా ఎందుకు వదిలేస్తుంది అంటే.. పూజాకి ఆ సినిమాలు నచ్చకనే అని తెలుస్తుంది.
పూజా హెగ్దే గుంటూరు కారం నుంచి కూడా బయట కు వెళ్లింది. దానికి కారణం మాత్రం సినిమా షూటింగ్ లేట్ అవడమే అని చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడో మొదలైన ఈ సినిమా కు పూజా ఇచ్చిన డేట్స్ అన్ని మిస్ యూజ్ అయ్యాయి. ఆ టైం లో షూటింగ్ జరుగుతుందని పూజా బేబీ వేరే సినిమా కు కొన్ని డేట్స్ ఇచ్చింది. అయితే గుంటూరు కారం సినిమా షూటింగ్ వాయిదా పడటంతో డేట్స్ క్లాష్ వల్ల పూజా ఆ సినిమా వదులుకోక తప్పలేదు.
ప్రస్తుతం గుంటూరు కారం చేయాల్సిన పూజా హిందీ సినిమా కు డేట్స్ ఇవ్వడం జరిగిందట. అందుకే పూజా సైలెంట్ గా ఎగ్జిట్ అయ్యింది. అయితే ఇచ్చిన అడ్వాన్స్ కోసం పూజా చేత ఒక ఐటం సాంగ్ చేయించాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇదే కాదు పూజా హెగ్దే ని సినిమాల్లో కేవలం గ్లామర్ షోకి మాత్రమే వాడుతున్నారు. ఈమధ్య కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రల కు వచ్చిన క్రేజ్ చూసిన పూజా తన ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది.
పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు అయితేనే పూజా హెగ్దే సినిమా కు ఓకే చెప్పాల ని చూస్తుందట. ఈ క్రమంలోనే ఒకటి రెండు సినిమాల ఆఫర్లు వచ్చినా అందులో తన పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితం గా ఉందని వాటిని కాదన్నదట. పూజా హెగ్దే సినిమాలు కాదంటుంటే మీడియా మాత్రం సీన్ రివర్స్ చేసి ఆమెకు ఆఫర్లు రావట్లేదు అన్నట్టుగా చెబుతున్నారు.
పూజా హెగ్దే మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉంటుంది. తెలుగు లో అవకాశాలు ఉన్నా లేకపోయినా సరే పూజా బేబీ హిందీ లో మాత్రం ఛాన్స్ లు అందుకుంటుంది. రీసెంట్ గా మాస్ మహరాజ్ రవితేజ గోపీచంద్ కాంబో సినిమా లో పూజా హెగ్దే నటిస్తుందనే వార్త వచ్చింది. అయితే దాని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.