సోఫాలో పూజ ప‌రిమ‌ళించిన పువ్వులా!

పూజాహెగ్డే మ‌ళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ కి ఎగురుకుంటూ వెళ్లినా అమ్మ‌డికి అక్క‌డా ప‌న‌వ్వ‌డం లేదు.

Update: 2023-12-21 05:55 GMT

పూజాహెగ్డే మ‌ళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ కి ఎగురుకుంటూ వెళ్లినా అమ్మ‌డికి అక్క‌డా ప‌న‌వ్వ‌డం లేదు. తాను ఒక‌టి అనుకుంటే ప్రాక్టీక‌ల్ గా మ‌రోక‌టి జ‌రుగుతుంది. దీంతో వ్యత్యాసం పెరిగిపోతుంది. జాబితాలో సినిమాల సంఖ్య త‌గ్గితే ఎలాంటి పరిస్థితులు ఎదుర‌వుతాయో తెలిసిందే. మార్కెట్ లో పేడౌట్ అనే ముద్ర ఒక్క‌సారి ప‌డిందంటే? కెరీర్ పై అది తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది.


ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండా బుట్ట‌బొమ్మ ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతుంది. అందుకే ఎందుకొచ్చిన బాలీవుడ్ అని మ‌ళ్లీ టాలీవుడ్ లో పై దృష్టి పెడుతుంది. ఈ నేప‌థ్యంలో త‌న‌కు బాగా క్లోజ్ గా ఉండే వాళ్ల‌తో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే అమ్మ‌డు ఓ మూడు ఛాన్సులు వ‌స్తున్న‌ట్లు కూడా ఈ మ‌ధ్య ప్ర‌చారం సాగింది. వాటిలో పూజ పేరు కేవ‌లం ప‌రిశీల‌న‌లోనే ఉంది. ఆ ఛాన్సులు ఎలాగైనా ఒడిసిపట్టు కోవాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.


మ‌రోవైపు న‌వ నాయిక‌ల నుంచి గ‌ట్టి పోటీ క‌నిపిస్తుంది. మీనాక్షి చౌద‌రి...శ్రీలీల లాంటి భామ‌లు ఇప్ప‌టికే పూజా స్థానంలోకి వ‌చ్చార‌నే వార్త అమ్మ‌డిని మ‌రోవైపు గంద‌ర‌గోళానికి గురిచేస్తోంది. మ‌రి ఇవ‌న్నీ దాటుకుని అమ్మ‌డు మ‌ళ్లీ టాలీవుడ్ లో ఎలా బిజీ అవుతుంది? అన్న‌ది చూడాలి. ఆ సంగ‌తి ఎలా ఉన్నా అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో యువ‌త హృద‌యాల్ని ఛిద్రం చేసేస్తుంది.


బికినీ..స్విమ్ షూట్ అంటూ కాక పుట్టించ‌డం ప‌రిపాటే. త‌న‌దైన మార్క్ అందాల ఎలివేన్ తో కుర్రాళ్ల‌ను ఆక‌ట్టుకుం టుంది. తాజాగా సొగ‌స‌రి న‌లుపు వ‌ర్ణం డిజైన‌ర్ ఔట్ ఫిట్ లో మెరుసిపోతున్న ఫోటో షేర్ చేసింది. అందులో అమ్మ‌డు సోఫాలో కూర్చుని వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ఎప్ప‌టిలాగే పూజా మార్క్ బ్యూటీ పిక్ లో హైలైట్ అవుతుంది. అమ్మ‌డి అందాల్ని చూసి త‌రించ‌డం అభిమానుల వంత్తైంది.


Tags:    

Similar News