మత్తు చల్లుతున్న అందాల బుట్టబొమ్మ
పూజాను లక్షలాదిగా అభిమానులు ఇన్ స్టా వేదికగా ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాల్లో స్పీడ్ గా ఉండే భామల్లో పూజా హెగ్డే పేరు టాప్ స్టాల్ లో చేరింది. జాన్వీ, సారా, అనన్య లాంటి స్టార్లతో పోటీపడుతూ పూజా వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఆరంభం సోషల్ మీడియాల్లో స్లోగా ఉన్న పూజా ఇటీవల స్పీడ్ మరింతగా పెంచింది. పూజాను లక్షలాదిగా అభిమానులు ఇన్ స్టా వేదికగా ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఫోటోషూట్ల పరంగా పూజా హెగ్డే ప్రయోగాత్మకంగాను కనిపిస్తోంది. ఇప్పుడు పర్పుల్ కలర్ ఫ్రాక్ లో కనిపించిన పూజా కొత్త లుక్ ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. పొడుగు కాళ్ల సుందరి అందం అంతా తన ఎంపికల్లోనే ఉంది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. పూజా తాజాగా పర్పుల్ కలర్ డిజైనర్ డ్రెస్ లో కనిపించింది. బ్యాక్ స్టేజ్ టు సెంటర్ స్టేజ్! అంటూ ఈ ఫోటోలను షేర్ చేసింది పూజా. ఈ కొత్త లుక్ లో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. వంగపువ్వు రంగు డిజైనర్ ఫ్రాక్ లో పూజా అందం మతులు చెడగొడుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... పూజా గుంటూరు కారంలో అవకాశం చేజార్చుకున్నా కానీ, తదుపరి పలు భారీ సినిమాల్లో నటించనుందని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఇటీవల హిందీ సహా సౌత్ సినిమాలకు సంతకాలు చేసేందుకు రెడీ అవుతోందని కథనాలొస్తున్నాయి.