బుట్టబొమ్మలో మార్పు తెలిసేదప్పుడే?
ఈ క్రమంలోనే మళ్లీ తెలుగు ప్రయత్నాలు మొదలు పెట్టడం అవకాశాలు వచ్చినట్లు రావడం చేజారడం జరిగింది. ఎలాగూ చివరికి నాగచైతన్య సరసన ఛాన్స్ అందుకోగల్గింది.
ఎట్టకేలకు బుట్టబొమ్మ పూజాహెగ్డే టాలీవుడ్ లో మళ్లీ రెండేళ్ల తర్వాత కంబ్యాక్ షురూ చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్యతో మరో సినిమా చేసే అవకాశం అందుకుంది. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా అమ్మడు బాలీవుడ్ కి వెళ్లింది. ఆరంభం ఎలా బెడిసి కొట్టింది కంబ్యాక్ కూడా అలాగే తేడా కొట్టింది. సరైన హిట్లు లేకపోవడంతో డీలా పడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగు ప్రయత్నాలు మొదలు పెట్టడం అవకాశాలు వచ్చినట్లు రావడం చేజారడం జరిగింది. ఎలాగూ చివరికి నాగచైతన్య సరసన ఛాన్స్ అందుకోగల్గింది.
అవకాశం ఒక్కసారి రావడమే కష్టం.. కానీ బుట్టబొమ్మకి ఎక్కడో సుడి ఉండి మళ్లీ రాగలిగింది. కానీ ఈసారి మునుపటి అంత ఈజీగా ఉండదు. ఇప్పటికే హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. అందులోనూ మాలీవుడ్ భామల దూకుడు తట్టుకుని నిలబడటం ఆషామాషీ కాదు.
నేచురల్ పెర్పార్మెన్స్ తో దుమ్ముదులిపేస్తున్నారు. దీంతో దర్శక-హీరోలు సౌత్ భామలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంత టఫ్ ఫైట్ మధ్య బుట్టబొమ్మ నిలవాలంటే? అందుకు తగ్గట్టు పనిచేయాల్సిందే.
తనని తాను అన్ని రకాలు మార్చుకోవాల్సిన అవసరం అంతే ఉందంటోంది ఇండస్ట్రీ. గతంలో ఈ అమ్మడిపై కొన్ని రకాల ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో ఓ నిర్మాత అయితే బహిరంగంగానే పద్దతి మారాలన్నారు. షూటింగ్ సెట్స్ కి అదనంగా స్టాప్ ని తీసుకొస్తుందని..వాళ్ల బాధ్యతలు కూడా నిర్మాతలే మోయాల్సి వస్తోందని... పారితోషికం హీరోయిన్ ఖర్చులు కాకుండా ఈ ఎక్స్ ట్రాలు ఏంటని మండిపడ్డారు. ఇక టాలీవుడ్ నుంచి ఓసినిమా విషయంలో వివాదంలోనూ ఇరుక్కుంది. అనివార్య కారణాలతో షూటింగ్ డిలే అవ్వడంతో అదనంగా డేట్లు కేటాయించడంలో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిందని ఆరోపణలొచ్చాయి.
అవన్నీ ప్రచార సమయంలో బయట పడ్డాయి. ఆ సినిమా ప్రచారం కూడా తూతూ గా కానిచ్చేసింది వెళ్లిపోయి నట్లు సోషల్ మీడియా కథనాలు అంతే వెడెక్కించాయి. ఇలా అమ్మడిపై కొంత నెగిటివిటీ అయితే ఉంది. కంబ్యాక్ నేపథ్యంలో వాటిని తొలగించుకోవాల్సిన అవసరం అంతే ఉందంటున్నారు. మునుపటిలా ఇప్పుడు చలామణి కుదరదని, నిర్మాతల కండీషన్లకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి బుట్టబొమ్మలో మార్పు ఏ మేర వచ్చిందో? సెట్స్ కి వెళ్లిన తర్వాత తెలుస్తుంది.