సెట్లో ఈ నటి ఎలాంటి ఫుడ్ తింటుందంటే?
టాలీవుడ్లో చాలా అవకాశాలు పోగొట్టుకుని.. హిందీలో వరస ఫ్లాపులు ఎదుర్కొని చాలా సతమతమవుతోంది పూజా హెగ్డే.
టాలీవుడ్లో చాలా అవకాశాలు పోగొట్టుకుని.. హిందీలో వరస ఫ్లాపులు ఎదుర్కొని చాలా సతమతమవుతోంది పూజా హెగ్డే. ఇలాంటి సమయంలో తమిళంలో సూర్య లాంటి అగ్ర హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది. కంగువ తర్వాత కెరీర్ 44వ చిత్రం(సూర్య 44)లో నటిస్తూ బిజీగా ఉన్నాడు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్సవ్వలేదు.
పూజా హెగ్డే ప్రస్తుతం షూటింగ్ కోసం చెన్నైలో ఉంది. ఇక సెట్లో పూజా హెగ్డే సందడి మామూలుగా లేదని సమాచారం. చిత్ర బృందంతో ఎంతో సరదాగా గడిపేందుకు పూజా ప్రాధాన్యతనిస్తోందట. ఇటీవల తాను అత్యంత ఇష్టమైన భోజనాన్ని ఆరగించానని పూజా సంతోషంగా చెప్పింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని రివీల్ చేసింది.
పూజా హెగ్డే దక్షిణ భారత వంటకాలకు గొప్ప అభిమాని. అరటి ఆకుపై రుచికరమైన వంటకాలను చక్కగా అమర్చిన సాంప్రదాయ థాలీ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ``నా ఆత్మకు నేరుగా వెళ్ళే ఆహారం`` అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. అరటి ఆకులో థాలీ ప్రామాణికమైన దక్షిణ భారతీయ వంటకాలతో నిండి ఉండగా పూజా అభిరుచి గురించి చిత్రయూనిట్ ముచ్చటించింది. బిజీ షెడ్యూల్ ఉన్నా చాలా చిన్న చిన్న ఆనందాలను ఎలా ఆస్వాధిస్తోందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
సూర్య 44 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ శ్రేయాస్ కృష్ణ, ఎడిటర్ షఫీక్ మొహమ్మద్ అలీ సహా ఉత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2డి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో జయరామ్, జోజు జార్జ్, కరుణాకరన్, నాసర్, సుజిత్ శంకర్ తదితరులు నటిస్తున్నారు.
పూజా హెగ్డే హిందీలో యాక్షన్ థ్రిల్లర్ `దేవా`లో నటిస్తోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ కథానాయకుడు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ - రాయ్ కపూర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. ఇది 14 ఫిబ్రవరి 2025 న విడుదల కానుంది.