బికినీ కంటే ఘాటైన సొగసులతో పూనమ్ స్టిల్స్

పూనమ్ బాజ్వా ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తునే ఉంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు నెటిజన్లను ఉర్రూతలూగిస్తున్నాయి

Update: 2024-11-20 16:58 GMT

పూనమ్ బాజ్వా ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తునే ఉంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు నెటిజన్లను ఉర్రూతలూగిస్తున్నాయి. గోవా వెకేషన్‌లో ‘గో డైరిస్’ ట్యాగ్‌తో ఆమె షేర్ చేసిన ఈ ఫోటోల్లో తెల్లని జాకెట్, రేట్ టాప్, షార్ట్‌తో సింపుల్‌గా స్టన్నింగ్ లుక్‌లో మెరిసిపోయింది. పూలు అలంకరించిన ఆమె కర్లీ హెయిర్, కూలింగ్ గ్లాసెస్‌తో ఏదో ప్రత్యేకమైన లుక్‌లో ఉంది.

పూనమ్ బాజ్వా తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, తన అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. 2005లో ‘మొదటి సినిమా’ ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి నటించిన ‘బాస్’ సినిమా ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు అందుకున్న పూనమ్, ఎక్కువగా రోమాంటిక్, ఫ్యామిలీ జానర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

పూనమ్ కు నటిగా కంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది తన గ్లామర్. ‘పరుగు’ సినిమాలోని హీరోయిన్ సిస్టర్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల నుంచి మంచి పేరును పొందింది. కానీ, బిగ్ సక్సెస్ లు లేకపోవడం వల్ల ఆమె కథానాయకిగా కొనసాగడానికి సాధ్యం కాలేదు. అయినా సరే, తన ప్రత్యేక నటన, అందంతో టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.

పూనమ్ బాజ్వా అందంతోనే ప్రతీసారి కొత్తగా కనిపిస్తోంది. ఆమె లోని నేచురల్ బ్యూటీకి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. 40 ఏళ్లకు దగ్గరవుతున్నా, ఆమె ఫిట్నెస్, గ్లామర్‌తో నేటి యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. తన నవ్వుతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తున్న పూనమ్, ప్రస్తుతం సోషల్ మీడియా ఫోటోషూట్ల ద్వారా మరోసారి తన అందాన్ని చూపిస్తోంది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకున్నా, తన గ్లామర్, ఫోటోషూట్ల ద్వారా ప్రేక్షకులకు చేరువ అవుతూ పూనమ్ బాజ్వా తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది.

Tags:    

Similar News