పూనమ్ కౌర్ పోస్ట్.. ఏపీ రాజకీయంలో కాక!
ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ తెరపైకి వచ్చారు. ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సంక్షోభ సమయాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.
భారీ వరదతో రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. బాధితుల ఆర్తనాదాలు సోషల్ మీడియాలో తెరపైకి వస్తోన్న వైనానికి దేశమంతా కన్నీరు పెడుతోంది. తినడానికి తిండి లేక, కరెంట్ లేక, పసి పిల్లలకు పాలు లేక వరద నీటిలోనే బిక్కు బిక్కు మంటూ జీవించాల్సిన పరిస్థితి. విజయవాడకు ఎన్నడు లేనంత అతి భారీ కష్టం వచ్చి పడింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
ఏపీ విషయానికి వస్తే ముఖ్యంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా బాధితుల స్థితిగతులు పడవపై వెళ్లి అడిగి తెలుసుకున్నారు. తక్షణం అవసరమైన సహాయ కార్యక్రమాలు దగ్గరుండి చేస్తున్నారు. బాధితులకు అండగా తాను చేయాల్సిం దంతా చేస్తున్నారు. రెండు రోజులుగా కలక్టేర్ కార్యాలయంలోనూ సీఎం బస. అర్ధరాత్రిళ్లు కూడా ఆయన సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ధీటుగా పనిచేస్తోంది.
మంత్రులంతా బాధితుల్ని ఆదుకునే పనిలోనే నిమగ్నమయ్యారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం పరామర్శ కార్యక్రమంలో ఎక్కడా కనిపించలేదు. విజయవాడలో వరద సంభవించి మూడు రోజులు అవుతున్నా ఆయన జాడ కనిపించట్లేదు. సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి కొన్ని వరుస ట్వీట్లు పెట్టారంతే. ఆ తర్వాత మళ్లీ పవన్ కనిపించలేదు.
ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ తెరపైకి వచ్చారు. ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సంక్షోభ సమయాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. 'ఇలాంటి సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాజకీయ నాయకులు అందుబాటులో ఉండకపోవడం, వాళ్లు కనిపించకపోవడం సరికాదని పేర్కొన్నారు.
ఇది ఆ రాజకీయ నాయకుల పచ్చి అవకాశవాదానికి, నిలువెత్తు స్వార్థానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే పూనమ్ పోస్ట్ పెట్టారంటూ నెటి జనులు చర్చించుకుంటున్నారు.