పూన‌మ్ కౌర్.. ఎవ‌రిపై ఈ పంచ్‌?

పూన‌మ్ కౌర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ పంజాబీ బ్యూటీ టాలీవుడ్‌లో ప‌లు చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించింది.

Update: 2024-09-27 17:30 GMT

పూన‌మ్ కౌర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ పంజాబీ బ్యూటీ టాలీవుడ్‌లో ప‌లు చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించింది. కానీ కెరీర్ ప‌రంగా ఆశించిన స్థాయికి ఎదగ‌లేక‌పోయింది. అంతేకాదు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో వివాదం కార‌ణంగా నిరంత‌రం హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో త‌న‌ను ఇబ్బంది పెట్టాడ‌ని చెబుతున్న స‌ద‌రు ద‌ర్శ‌కుడిపై కామెంట్ చేయ‌డం ద్వారా మ‌రోసారి మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చింది.

ఇక పూన‌మ్ ఆ ద‌ర్శ‌కుడిని, అత‌డి స్నేహితుడైన ప్ర‌ముఖ సినీ హీరోను చాలాసార్లు టార్గెట్ చేయ‌డంతో ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీతో చేతులు క‌లిపి ఇలా వారిని టార్గెట్ చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇటీవ‌ల తిరుప‌తి ల‌డ్డూ వివాదం నేప‌థ్యంలో పూన‌మ్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఘాటు వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది. దాని సారాంశం ఇలా ఉంది.

``హిందూ మ‌తాన్ని స్వ‌లాభం కోసం ఉప‌యోగించుకోవడం వేరు... హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు!`` అంటూ సున్నిత అంశాన్ని ట‌చ్ చేస్తూ సెటైర్ వేసింది. అయితే ఇది ఎవ‌రిని ఉద్ధేశించి? అంటూ సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఇది ఆ ద‌ర్శ‌కుడి స్నేహితుడైన ప్ర‌ముఖ హీరో గురించేనా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే పూన‌మ్ ఎలాంటి కామెంట్ చేసినా దానికి రియాక్ట‌య్యే అభిమాన వ‌ర్గం ఒక‌టి ఉంది. వారంతా పూన‌మ్ పై సీరియ‌స్ గా కౌంట‌ర్లు వేస్తున్నారు. ఇంత‌కీ ఎవరిని టార్గెట్ చేస్తోందో పూన‌మ్ స్వయంగా చెబుతుందంటారా?

Tags:    

Similar News