ఏంటి.. ఆ బ్యూటీ చనిపోయిందా?

"ఈ ఉదయం మాకెంతో కష్టమైనది. మా ప్రియమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్‌ తో చికిత్స తీసుకుంటూ మరణించింది

Update: 2024-02-02 07:22 GMT

బాలీవుడ్‌ ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌ తో గత రాత్రి ఆమె మరణించినట్లు ఇన్‌ స్టాగ్రామ్‌లో అధికారికంగా ఆమె వ్యక్తిగత సిబ్బంది పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూనమ్ మరణవార్త విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పూనమ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లే.

"ఈ ఉదయం మాకెంతో కష్టమైనది. మా ప్రియమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్‌ తో చికిత్స తీసుకుంటూ మరణించింది. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి పట్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను పంచింది. ఈ దుఃఖ సమయంలో ఈ విషయాన్ని మేం షేర్‌ చేసేందుకు బాధపడుతున్నాం. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం" అని పూనమ్ సన్నిహితులు పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇక పూనమ్ పాండే మరణించిన వార్తలపై నెట్టింట పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇది నిజమేనా అని కొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే అకౌంట్ హ్యాక్ అయిందా అని ప్రశ్నిస్తున్నారు. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన పూనమ్‌.. 2013లో నాషాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేశారు. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. నటి కంగనా రనౌత్‌ హోస్ట్‌ గా వ్యవహరించిన లాకప్‌ తొలి సీజన్‌లో పాల్గొన్నారు.

2011 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్‌ పాండే చాలా పాపులర్‌ అయ్యారు. ప్రపంచకప్ ను భారత్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించారు. ఇక ఆమె వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

పూనమ్ పాండే ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ఆమె చేసే ఫొటో షూట్లు, షేర్ చేసే వీడియోలు ఎంత అశ్లీలంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కువగా అడల్ట్ కంటెంట్‌ ను చేసేందుకే పూనమ్ పాండే మొగ్గు చూపించినట్టుగా కనిపిస్తుంటారు. ఆమె ఎప్పుడూ 18 ప్లస్ కంటెంట్‌ను మాత్రమే ప్రమోట్ చేస్తుంటారు. నెట్టింట్లో చేసే హంగామానే ఓ రేంజ్‌లో చర్చలకు దారి తీస్తుండేది. అలాంటి పూనమ్ పాండే ఇప్పుడు క్యాన్సర్ బారిన పడి మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News