వెయ్యి కోట్ల పోటీలో డైనోసార్ గర్జించేనా?
ప్రభాస్ కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన సలార్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన సలార్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేసేలా ఉన్నాయి. తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ కూడా ఎంతో నమ్మకంతో ఉంది.
అందుకే విడుదల విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకుని ఏ మాత్రం పోటీ లేకుండా డిసెంబర్ 22 నుంచి బాక్సాఫీస్ వద్ద సలార్ డైనోసార్ లా గర్జించాలని అనుకుంది కానీ ఇప్పుడు షారుక్ ఖాన్ డుంకి తో పోటీ పడక తప్పడం లేదు. అసలే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎక్కువగా యాక్షన్ లేకపోయినప్పటికీ కూడా ఆదర్శకుడు ఎమోషనల్ కంటెంట్ తో మెసేజ్ ఎస్టీ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో సక్సెస్ కావడం కాయం.
అసలే షారుక్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. జవాన్ పఠాన్ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా పఠాన్ సినిమాకు అయితే 1000 కోట్ల కలెక్షన్స్ రావడంతో ఇప్పుడు రాబోయే డుంకి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ పోటీలో డిసెంబర్ మొదట్లోనే రణ్ బీర్ కపూర్ యానిమాల్ రాబోతోంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం 200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుంది.
దర్శకుడు సందీప్ రెడ్డి అక్కడ అర్జున్ రెడ్డిని రీమేక్ చేసే సాలిడ్ కలెక్షన్స్ అందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యానిమల్ తప్పకుండా హై రేంజ్ లో మాత్రం ఓపెనింగ్స్ అయితే అందుకుంటుంది. టాక్ ఎలా వచ్చినా కూడా డిసెంబర్లో రాబోయే ఈ మూడు బిగ్ సినిమాలే చాలా తొందరగా 1000 కోట్లు అందుకుంటాయి.
ఇక వీరితో పాటు నాని “హాయ్ నాన్న” డిసెంబర్ 7న విడుదల కానుంది, ఆ తర్వాత వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” డిసెంబర్ 8న హిందీ మరియు తెలుగులో విడుదల కానుంది. నితిన్ యొక్క “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” కూడా అదే తేదీన విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది, విశ్వక్ సేన్ యొక్క “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” డిసెంబర్‌లో విడుదల కానుంది. దీంతో డిసెంబర్ లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఉహాలకందని రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి డిసెంబర్ ఫైట్ లో సలార్ డైనోసార్ గర్జన ఎలా ఉంటుందో చూడాలి.