2024లో ప్రభాస్ సినిమా నెంబర్ వన్ రికార్డ్!
అయితే 'పుష్ప 2' మూవీ కల్కి కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ 'కల్కి 2898ఏడీ' వరల్డ్ వైడ్ గా 1150 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకొన్న ఇండియన్ మూవీగా 'కల్కి' చిత్రమే ఉంది. అయితే 'పుష్ప 2' మూవీ కల్కి కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా సెకండ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది.
అయితే 'కల్కి 2898ఏడీ' చిత్రాన్ని నాగ్ అశ్విన్ మహాభారతంలో కురుక్షేత్రం సంగ్రామానికి లింక్ పెట్టి శ్రీమహావిష్ణువు 11వ అవతారం అయిన కల్కి రావడానికి ముందు జరిగిన కథగా ప్రెజెంట్ చేశారు. విజువల్ స్పెక్టక్యులర్ గా తెరపై ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించి ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్ పెర్ఫార్మెన్స్ కి అయితే ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటించారు.
ఈ మూవీ పార్ట్ 2 కోసం ఇప్పుడు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ IMDB ప్రకటించింది. ఇందులో 'కల్కి 2898ఏడీ' మొదటి స్థానంలో నిలిచింది. తద్వారా అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది. 'బాహుబలి' సిరీస్ తర్వాత తెలుగు సినిమాలు ప్రతి ఏడాది ఇండియన్ మోస్ట్ పాపులర్ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి.
ఈ ఏడాది బాలీవుడ్ నుంచి ఒక్క 'స్త్రీ 2' మూవీ తర్వాత భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాలు లేవు. స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోయాయి. తెలుగులో వచ్చిన 'హనుమాన్', 'కల్కి', 'దేవర', ఇప్పుడు 'పుష్ప 2' టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈ సినిమాల గురించి సోషల్ మీడియాలో కూడా దేశ వ్యాప్తంగా ఎక్కువ చర్చ నడిచింది.
ఇదిలా ఉంటే 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' స్క్రిప్ట్ ని నాగ్ అశ్విన్ ఇప్పటికే కంప్లీట్ చేసేశాడని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారంట. మరో వైపు జపాన్, చైనా భాషలలో 'కల్కి 2898 ఏడీ' సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. 2025లో ఈ మూవీ భారతీయేతర భాషలలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.