ప్రభాస్- హను రాఘవపూడి.. ఏం జరుగుతోంది?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో కల్కి 2898 ఏడీ మూవీతో సందడి చేయనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో కల్కి 2898 ఏడీ మూవీతో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రభాస్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన డ్యూయల్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. కల్కి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యాక.. మారుతి రాజా సాబ్ సెట్స్ లో డార్లింగ్ అడుగుపెట్టినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్స్ కొన్ని పూర్తయ్యాయి. త్వరలో మొదలు కానున్న కొత్త షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది వచ్చి సూపర్ హిట్ అయిన సలార్ సీక్వెల్ షూటింగ్ మే నెల చివర్లో మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ అలా ఏం జరగలేదు. ప్రశాంత్ నీల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ అప్ కమింగ్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ హీరోగా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి లవ్ స్టోరీని తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమధ్య ఓ ఈవెంట్ లో తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ తోనే చేయబోతున్నట్లు హను రాఘవపూడి తెలిపారు. రీసెంట్ గా ఆయన.. ప్రభాస్ కు స్టోరీ అంతా నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. డార్లింగ్ ఎంతో ఇంప్రెస్ అయ్యారని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవుతాయని సమాచారం.
వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుందని.. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ సైనికుడిలా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఫోటో షూట్ స్టార్ట్ చేయాలని హను రాఘవపూడికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. మరి ప్రభాస్ ను ఆయన సిల్వర్ స్క్రీన్ పై ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్ర శేఖర్ బాణీలు కట్టనున్నట్లు సమాచారం.
అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి.. ఫస్ట్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలను తెరకెక్కించారు. 2022లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో సీతారామం మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించని హను రాఘవపూడి.. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు. మరి ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.