ప్రాజెక్ట్ K - వామ్మో ఇది ఫస్ట్ లుక్కా.. ఫ్యాన్ మేడ్ పిక్కా?

అందులో ప్రభాస్ హాలీవుడ్ హీరో తరహా లో పవర్ ఫుల్ హీరో గా క్యాస్ట్యూమ్స్ తో ఉన్నాడు. అలాగే సరికొత్త గెడ్డం డిఫరెంట్ హెయిర్ స్టైల్ కూడా ఉంది.

Update: 2023-07-19 10:53 GMT

ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు అన్నీ కూడా ఇప్పుడు రాబోయే సినిమాల పైనే ఉన్నాయి. తప్పకుండా సలార్ సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఆ తర్వాత రాబోయే ప్రాజెక్ట్ K కూడా మరొక లెవెల్ లో ఉంటుంది అని, అసలే ఫ్యాన్ ఇండియా వరల్డ్ అంటున్నారు కాబట్టి తప్పకుండా సినిమా అంచనాల కు మంచి ఉంటుంది అని ఫాన్స్ అయితే చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.


అందులోనూ మంచి నమ్మకం ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్, దానికి తోడు 50 సినిమాల అనుభవం ఉన్న వైజయంతి మూవీస్, 550 కోట్ల భారీ బడ్జెట్ తో తీసుకొస్తున్న సినిమా కాబట్టి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అనే అనుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ విషయం లో అయితే చాలా ఆలస్యం జరిగింది.

సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు కానీ ఇంకా రెగ్యులర్ ప్రమోషన్స్ విషయం లో స్పీడ్ పెంచకపోవడంతో ఫ్యాన్స్ నుంచి కూడా కాస్త వ్యతిరేకత వచ్చింది. అయితే మొత్తానికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. అందులో ప్రభాస్ హాలీవుడ్ హీరో తరహా లో పవర్ ఫుల్ హీరో గా క్యాస్ట్యూమ్స్ తో ఉన్నాడు. అలాగే సరికొత్త గెడ్డం డిఫరెంట్ హెయిర్ స్టైల్ కూడా ఉంది. సినిమా లో ఇలానే ఉంటుందేమో కానీ ఈ పోస్టర్ చూస్తే మాత్రం వర్గం ఫ్యాన్స్ అయితే చాలా నిరాశ చెందారు అనే అనిపిస్తోంది.

పొరపాటున ఫ్యాన్ మేడ్ పిక్ పోస్ట్ చేశారా? అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా గ్రాఫిక్స్ కాస్ట్యూమ్ కు ప్రభాస్ తల ను అతికించినట్లు ఉంది అని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూడగా పూర్తిస్థాయి లో మాత్రం వైజయంతి మూవీస్ నిరాశపరిచింది అని అంటున్నారు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా కూడా నిరుత్సాహ పరుస్తూనే ఉంది. ఈసారి అయినా రాబోయే సినిమాలతో తప్పకుండా సక్సెస్ అవుతాయి అని నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ కు మళ్లీ ఈ పోస్టర్ ద్వారా ఊహించని షాక్ అయితే ఎదురయింది. పోస్టర్లు అయితే ప్రభాస్ సీరియస్ లుక్ బాగానే ఉన్నా ఏదో ఐరన్ మాన్ కాస్ట్యూమ్ కి ప్రభాస్ తల ను అతికించేశారు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి ఫస్ట్ గ్లింప్స్ లో అయినా ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News