ప్రభాస్.. హను.. మళ్ళీ అదే బడ్జెట్?

ఇక ఈ కాంబినేషన్ లో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది డిసెంబర్లో ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Update: 2023-11-18 11:42 GMT

ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఉంటుంది అని ఇప్పటికే కొన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి అయితే ఈ విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టుకు నిర్మించనుంది అని కూడా టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

ఎందుకంటే ఇదివరకే మైత్రి వాళ్ళు ప్రభాస్ కు అడ్వాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా సీతారామం సక్సెస్ తరువాత దర్శకుడు హను రాఘవపూడి కి కూడా అడ్వాన్స్ ఇచ్చారు. ఇక ఈ కాంబినేషన్ లో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది డిసెంబర్లో ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం దర్శకుడు పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా టెక్నీషియన్స్ తో పాటు సినిమా నటీనటుల విషయంలో కూడా ముందుగానే ఒక క్లారిటీకి రాబోతున్నారట. ఇక లేటెస్ట్ గా నిర్మాతలతో దర్శకుడు మాట్లాడిన దాన్నిబట్టి బడ్జెట్ టార్గెట్స్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

ఎప్పటిలాగే ప్రభాస్ సినిమా కోసం మళ్లీ దాదాపు మూడు వందల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ ప్రతి సినిమా విషయంలోనూ బడ్జెట్ తక్కువగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఉన్నాడు. మారుతి సినిమాను 150 కోట్లలోపే పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ ఆ సినిమా లెక్క కూడా 300 కోట్ల వరకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఇప్పుడు హను రాఘవపూడి లవ్ స్టోరీ సినిమా చేస్తున్నప్పటికీ కూడా ఈ బడ్జెట్ సైతం 300 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ప్రత్యేకంగా సినిమా కోసం కొన్ని సెట్స్ కూడా నిర్మించనున్నారట. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే సినిమాను అధికారికంగా లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రభాస్ వచ్చే ఏడాది జనవరి తర్వాత మొదలుపెట్టే అవకాశం ఉందట.

Tags:    

Similar News