ప్రభాస్ కి ఇష్టం లేని ఫుడ్ ఏంటో తెలుసా?

డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికి పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు ఫుడ్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది

Update: 2024-03-22 06:31 GMT

డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికి పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు ఫుడ్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అనే సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలని ఇష్టంగా తింటాడు. ఎక్కడ షూటింగ్ లలో ఉన్నా కూడా తన కోసం ప్రత్యేకంగా వండించుకోవడం ప్రభాస్ కి అలవాటు. అదే హైదరాబాద్ లో ఉంటే ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించుకుంటాడు.

ప్రభాస్ షూటింగ్ లో భోజనం తెప్పించాడంటే కనీసం అతనితో పాటు 10, 20 మంది కూర్చొని తినొచ్చు. తనతో వర్క్ చేసే ఆర్టిస్ట్స్, డైరెక్టర్ తో పాటు అందరికి కూడా ప్రభాస్ ప్రత్యేకంగా భోజనాలు తెప్పిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని హీరోయిన్స్ కూడా చాలా సందర్భాలలో చెప్పారు. అలాగే ప్రభాస్ తో కలిసి నటించే సహా నటులు కూడా డార్లింగ్ భోజనంతో ఇబ్బంది పెడతాడని సరదాగా ఇంటర్వ్యూలలో చెప్పారు.

అయితే ప్రభాస్ అంత భోజన ప్రియుడు అయిన అతనికి నచ్చని వంటకం ఒకటి ఉంది. కాకరకాయ కూర అంటే డార్లింగ్ కి అస్సలు ఇష్టం ఉండదంట. అయితే చిన్న వయస్సులో ఆరోగ్యానికి మంచిదని బలవంతంగా తినిపించేవారంట. కానీ ప్రస్తుతం మాత్రం ప్రభాస్ కాకరకాయ జోలికి వెళ్లడంట. అందుకే అతను మెనూలో కూడా ఆ కర్రీ ఎప్పుడు ఉండదని టాక్.

డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా ఆవిష్కరించారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఇండియన్ మైథాలజీ రిఫరెన్స్ తో కల్కి మూవీ కథని సిద్ధం చేశారు. ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు.

ఎన్నికల హడావిడి కారణంగా ఈ మూవీ వాయిదా పడనుందని తెలుస్తోంది. జూన్ లేదా ఆగష్టులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగష్టులో కల్కి రిలీజ్ చేస్తే ఆ డేట్ లో ఉన్న పుష్ప ది రూల్ వాయిదా పడే అవకాశం ఉంటుంది. కల్కి 2898ఏడీ బిజినెస్ డీల్స్ ని క్లోజ్ చేసే పనిలో నిర్మాత అశ్వినీదత్ ఉన్నారు. ఓటీటీ కోసం ఏకంగా 180 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట. మరి అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి ఓటీటీ కంపెనీలు ముందుకొస్తాయా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News