ప్రభాస్.. ఇక టెన్షన్ లేకుండా..

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు.

Update: 2024-07-18 04:52 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి 2898ఏడీ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్నాడు. కల్కి 2898ఏడీ మూవీ వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే థియేటర్స్ లో డీసెంట్ వసూళ్లతో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల కోసం సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో రాజాసాబ్ రిలీజ్ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2 సినిమాలు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. వాటిని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడనేది ఇంకా క్లారిటీ లేదు. మరో వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ప్రభాస్ చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మూవీ చేస్తున్నాడు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందంట. ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియాలో సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

వార్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీగా మూవీ కథాంశం ఉంటుందంట. సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలకి కూడా స్ట్రాంగ్ అండ్ ఫిట్ లుక్ ని ప్రభాస్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. పోలీస్, సోల్జర్ క్యారెక్టర్స్ ని ప్రేక్షకులు ఎప్పుడు కూడా పవర్ ఫుల్ గా చూస్తారు. ఆ పవర్ ని చూపించాలంటే ఫిట్ నెస్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

చిన్న చిన్న మార్పులు తప్ప రెండు సినిమాలలో ప్రభాస్ లుక్ ఇంచుమించు ఒకే విధంగా ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. అందుకే ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా ఒకేసారి చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ప్రభాస్ ప్రతీసారి ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడేవారు. కానీ ఈసారి టెన్షన్ లేకుండా షూటింగ్స్ ఫినిష్ చేయనున్నాడు. కల్కి పార్ట్ 2 మూవీ షూటింగ్ అయితే వచ్చే ఏడాదిలోనే స్టార్ట్ అవ్వొచ్చనే మాట వినిపిస్తోంది. సలార్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇంకా అధికారికంగా క్లారిటీ లేదు.

ఏది ఏమైనా వరుస ప్రాజెక్ట్స్ పెట్టుకొని కూడా డార్లింగ్ ప్రభాస్ ఏ మాత్రం అలసట లేకుండా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ ఉండటం నిజంగా విశేషమని చెప్పాలి. కల్కి మూవీ రిలీజ్ ఆలస్యం అవడం వలన ఈ ఏడాదిలో ఒక్క సినిమాని మాత్రమే ప్రేక్షకులకి డార్లింగ్ అందించగలిగాడు. అయితే వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలు రిలీజ్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News