కల్కి లో మన వాళ్లని ఎందుకు తీసుకోలేదు.. కారణం అదేనా..?

బిగ్ బీ ఫ్యాన్స్ అందరికీ కల్కి ఒక స్పెషల్ ట్రీట్ గా నిలిచేలా చేశారు.

Update: 2024-06-30 05:59 GMT

ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె అనౌన్స్ చేసిన నాగ్ అశ్విన్ వైజయంతి బ్యానర్ లో 500 కోట్లతో ఈ సినిమా చేస్తున్నాడని సినిమా మొదలైన టైం లో వార్తలు వచ్చాయి. ఐతే సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె లను భాగం చేస్తున్నాడని తెలిసి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఐతే రీసెంట్ గా రిలీజైన కల్కి 2898 ఏడి సినిమా చూశాక నాగ్ అశ్విన్ ఎందుకు వాళ్లను సినిమాలో తీసుకున్నాడో అర్థమైంది. కల్కి సినిమాలో ప్రభాస్ కాంట్రిబ్యూషన్ కి ఏమాత్రం తగ్గకుండా వారి వారి పాత్రల్లో పూర్తి స్థాయి న్యాయం చేశారు అమితాబ్, కమల్ హాసన్, దీపిక పదుకొనె.

అమితాబ్ అయితే అశ్వద్ధామ పాత్రలో అదరగొట్టేశారు. బిగ్ బీ ఫ్యాన్స్ అందరికీ కల్కి ఒక స్పెషల్ ట్రీట్ గా నిలిచేలా చేశారు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో మరోసారి తన వర్సటాలిటీ చూపించారు. యాస్కిన్ గా కమల్ లుక్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఫైనల్ గా సినిమాలో కమల్ వచ్చినప్పుడల్లా కేకలు వేశారు. ఇక సినిమాలో సుమతి పాత్రలో దీపిక అదరగొట్టేసింది. తనకు ఇచ్చిన పాత్రను పర్ఫెక్ట్ గా చేసింది దీపిక. ప్రభాస్ తర్వాత సినిమాలో మేజర్ రోల్స్ చేసిన వీరంతా తమ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించారు.

ఐతే నాగ్ అశ్విన్ ఎందుకు వీళ్లనే తీసుకున్నాడు. మన తెలుగు హీరోలను తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ సౌత్ సినిమాలో నార్త్ హీరోలు నటిస్తే సినిమా ఎలాగు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ కలిసి వస్తుంది. అమితాబ్, దీపిక ల వల్ల హిందీ బెల్ట్ మొత్తం ఈ సినిమాను తమ భుజాన వేసుకుంటుంది. ఇక కమల్ హాసన్ నటిస్తే కోలీవుడ్ లో ఈ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. అలా సినిమా కాస్టింగ్ విషయంలో నాగ్ అశ్విన్ మెగా ప్లాన్ వేశారని చెప్పొచ్చు.

ఐతే మన స్టార్స్ ని వాడితే ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉండదా అంటే ఉంటుంది కాకపోతే చేసేది పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆ పాత్రలకు వాళ్లైతే పర్ఫెక్ట్ అని అనుకున్నాడు నాగ్ అశ్విన్ అందుకే కాస్టింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్రభాస్ తన ప్రతి సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. కల్కి తో ప్రభాస్ పేరు మరోసారి సినీ విశ్వమంతా వినిపిస్తుంది.

Tags:    

Similar News