'కల్కి' లీక్ ని నాగి ఆపలేక పోయాడు!
'కల్కి 2898 ఏడి' సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాకపోవచ్చు అని దాదాపుగా కన్ఫర్మ్ అయింది.
ప్రభాస్ హీరోగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే 'కల్కి 2898 ఏడి' సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాకపోవచ్చు అని దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సమయంలో సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ ను నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
నాగ్ అశ్విన్ ఈ సినిమా పై చాలా శ్రద్ద పెట్టాడు. మహానటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. ప్రభాస్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను చిత్రీకరించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రాల జాబితాలో ఈ సినిమా నిలువబోతుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఖర్చు చేసిన నాగ్ అశ్విన్ ప్రమోషన్ విషయం లో కూడా సరికొత్తగా ప్లాన్ చేయాలని భావిస్తున్నాడు.
ఇలాంటి భారీ చిత్రాలకు సంబంధించిన చిన్న చిన్న లొకేషన్ పిక్స్ లేదా ఇతర స్టిల్స్ బయటకు లీక్ అవుతూ ఉంటాయి. కానీ దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుతున్నా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలాంటి లీక్ లు లేకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఇప్పుడు సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం వెళ్లడం తో దర్శకుడు నాగి లీక్ ను ఆపడం లో విఫలం అయ్యాడు.
వీఎఫ్‌ఎక్స్ షాట్స్ నుండి ప్రభాస్ కి సంబంధించిన ఒక స్టిల్ బయటకు వచ్చింది. మినిమం ఎడిట్ చేయని ఆ షాట్ లోని స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పిక్ ను తొలగించేందుకు గాను మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫోటోను ప్రముఖ మీడియా సంస్థ లు ఏవీ కూడా చూపించొద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది.
సినిమా పై ఉన్న బజ్ నేపథ్యంలో ఇలాంటి లీక్ లు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలకు లీక్ ల వల్ల డ్యామేజ్ జరిగినా ఎక్కువ సినిమాలకు లీక్ ల వల్ల పాజిటివ్ టాక్ కలిసి వస్తుంది అనడంలో సందేహం లేదు. అయినా కూడా దర్శకుడు నాగి మళ్లీ లీక్ లు జరగకుండా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది.