ఇన్‌సైడ్ టాక్ : 'కల్కి 2898 AD' ఎలా ఉందంటే?
ప్రభాస్ కల్కి 2898 AD ట్రైలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ ని వీక్షించిన వారి నుంచి కొన్ని లీకులు అందాయి
ప్రభాస్ కల్కి 2898 AD ట్రైలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ ని వీక్షించిన వారి నుంచి కొన్ని లీకులు అందాయి. దాని ప్రకారం.. కల్కి చిత్రం ప్రథమార్థం క్లాస్ అప్పీల్‌తో అలరించనుండగా, ద్వితీయార్థంలో మాస్ ని అలరించే ఎలిమెంట్స్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. క్లాస్ మాస్ ఆడియెన్ తో పాటు పిల్లల్ని అలరించే ఎలిమెంట్స్ కి ఈ సినిమాలో కొదవేమీ లేవు.
ప్రథమార్థం సినిమా కంటెంట్ ఏంటో అర్థం చేసుకునేందుకు ఉద్ధేశించినది. నాగ్ అశ్విన్ సృష్టించిన భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండనుందో పరిచయం చేస్తారు. నెమ్మదిగా కల్కి లోకంలో ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ద్వితీయార్థంలో ఉత్కంఠ కలిగించే అంశాలకు కొదవేమీ ఉండదు. ఇక ప్రథమార్థాన్ని మించి ద్వితీయార్థంలో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అంశాలు ఉంటాయి. అలాగే కల్కి సీక్వెల్ కి సంబంధించిన అంశాల్ని కూడా పార్ట్ 1లో చూపించనున్నారు. ఇక ప్రథమార్థంలో కమల్ పాత్రను కేవలం పరిచయం చేస్తారు. కల్కి 2లో విశ్వనటుడి విశ్వరూపం వీక్షించేందుకు ఆస్కారం ఉంది.
కల్కి 2898 AD కథ అపోకలిప్టిక్ అనంతర ప్రపంచంలో 2898 సంవత్సరంలో సాగుతుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఆంగ్ల భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఆసక్తికరంగా, ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పికు - ఆరక్షన్ తర్వాత మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో దీపిక కు మూడవ సినిమా కానుంది.
మోస్ట్ అవైటెడ్ కల్కి 2898 AD ట్రైలర్ జూన్ 10న (సోమవారం) విడుదల కానుంది. తెలుగు తమిళం హిందీ సహా పలు భాషల్లో ట్రైలర్ విడుదల కానుంది. అయితే కల్కి 2898 AD ట్రైలర్ జూన్ 10న సాయంత్రం 6 గంటలకు విడుదలవుతుంది. హిందీ ట్రైలర్ కూడా ఏకకాలంలో సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ అవుతుంది.
కల్కి 2898 AD చిత్రానికి పురాణేతిహాసాల కనెక్షన్ ని కలిగి ఉంది. మహాభారతంలోని కొన్ని సంఘటనలను క్రీ.పూ. 3102 సంవత్సరంలో ఏం జరిగిందో తెలుపై చూపిస్తారు. ఈ సినిమా కథాంశంలో హిందూ దేవుళ్లను పూజించే అంశాలను చూపించడం లేదు.