ఇందులో ప్యూచర్ ప్రభాస్.. ఇండియా ప్యూచర్ సిటీ!
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సీజ్ పైర్ తో మరో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తుంది.
డార్లింగ్ ప్రభాస్ `సలార్` సీజ్ పైర్ తో మరో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో 'సలార్ -2' అంతకు మించి ఉంటుందని డార్లింగ్ రివీల్ చేయడంతో అంచనాలు అంకంతకు పెరిగిపోతున్నాయి. అసలైన యాక్షన్ పార్టీ రెండవ భాగంలో ఉంటుందని తేలిపోయింది. వివిధ దేశాల ఆర్మీలన్నీ ఒకవైపు ఉంటే? సలార్ ఆర్మీ ఒక్కటే? ప్రపంచ దేశాల ఆర్మీపై ఎలా తిరగబడ్డాడు? అన్నది రెండవ భాగంలో చూపించనున్నారు.
పార్ట్ -2 లో నెక్స్ట్ లెవల్ ప్రభాస్ చూపించనున్నాడని తెలుస్తోంది. ఇదే స్పీడ్ లో నాగ్ అశ్విన్ ప్రభాస్ ని అంతకు మించి తన సినిమాలో చూపించబోతున్నట్లు మరోసారి ధీమా వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ కాంబినే షనల్ లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `కల్కీ 2898` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ముంబై ఐఐటీలో జరిగిన టెక్ పెస్ట్-23 లో మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లోనే..
'ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ప్యూచరిస్ట్ సినిమాల్లో అక్కడ సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూసాం. కల్కిలో భారత్ భవిష్యత్ లో సిటీలు ఎలా ఉండనున్నాయో ప్రేక్షకులు చూస్తారు. ఇదొక భిన్నమైన చిత్రం. ప్రతీ అంశం లోతుగా ఆలోచించి..స్క్రాచ్ నుంచి అన్నీ కొత్తగా డిజైన్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ప్రేక్షకులు దీంట్లో ప్యూచర్ ప్రభాస్ ని చూస్తారు.
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. మరో 93 రోజుల తర్వాత సినిమా ట్రైలర్ రిలీజ్ ఉండొచ్చు' అని అన్నారు. దీంతో కల్కి గురించి సాలిడ్ అప్ డేట్ మార్కెట్ లోకి వచ్చినట్లు అయింది. ఇంతవరకూ ట్రైలర్ రిలీజ్ అంశంపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానుల్లో చర్చకే పరిమితమైంది తప్ప! ఆయన ఎక్కడా నోరు విప్పలేదు. తొలిసారి ట్రైలర్ గురించి..ప్రభాస్ పాత్ర గురించి అంచనాలు పెంచేసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.