ప్రభాస్ అసలు టైమొచ్చింది!!

మార్చి 12వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రభాస్.. కన్నప్ప షూట్ లో పాల్గొనున్నారట. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట మేకర్స్.

Update: 2024-03-30 08:51 GMT
ప్రభాస్ అసలు టైమొచ్చింది!!
  • whatsapp icon

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మధు బాల, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాను ముకేశ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్ ఈ చిత్రం రెండు షెడ్యూళ్ల షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నట్లు గతంలో నటి మధు బాల వెల్లడించారు. ఆ తర్వాత ప్రభాస్ రోల్ పై మంచు విష్ణు కూడా మాట్లాడారు. సినిమాలో ప్రభాస్ పాత్ర అద్భుతంగా ఉంటుందని, సమయం వచ్చినప్పుడే డార్లింగ్ రోల్ కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని విష్ణు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ లో ప్రభాస్ రోల్ పై మంచి ఆసక్తి నెలకొంది. ప్రభాస్, నయనతార.. శివపార్వతుల పాత్రల్లో కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు కైలాసంలోని శివపార్వతులకు సంబంధించిన షాట్స్ తోపాటు క్లైమాక్స్ సీన్స్ ను షూట్ చేయడానికి కన్నప్ప మేకర్స్ సిద్ధమయ్యారట. అందుకు తన పాత్రను పూర్తి చేయడానికి ప్రభాస్ ఐదు రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట. మార్చి 12వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రభాస్.. కన్నప్ప షూట్ లో పాల్గొనున్నారట. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట మేకర్స్.

అయితే అంతా అనుకుంటున్నట్లు ప్రభాస్.. నిజంగానే శివుడి పాత్రలో కనిపించబోతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీకి ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా స్పెషల్ రోల్ లో నటిస్తున్నట్లు ఇదివరకే కొన్ని గాసిప్స్ వచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాలి. మంచు విష్ణు.. ప్రభాస్ కు స్పెషల్ రిటర్న్ గిప్ట్ కూడా ఇవ్వనున్నారట. ప్రభాస్ ఈ సినిమాలో భాగమవ్వడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న ఆయన ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

ముకేశ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. రూ.150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తూనే ముఖ్య పాత్రలో కూడా కనిపించనున్నారు. విష్ణు కుమారుడు అవ్రామ్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు. మరి విష్ణు కలల ప్రాజెక్ట్.. ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News