ప్రభాస్ కర్ణ.. ఇలా కనిపిస్తే మాత్రం…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని కల్కి 2898ఏడీ సినిమాలో నాగ్ అశ్విన్ భైరవ పాత్రలో చూపించారు.

Update: 2024-07-05 04:08 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని కల్కి 2898ఏడీ సినిమాలో నాగ్ అశ్విన్ భైరవ పాత్రలో చూపించారు. అదే సమయంలో భైరవ క్యారెక్టర్ కర్ణుడికి పునర్జన్మగా క్లైమాక్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడే కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడి పాత్రలో ప్రభాస్ ని కూడా ఒక్క పేస్ వరకు రివీల్ చేశాడు. ఈ లుక్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే కర్ణుడిని అర్జునుడు కంటే గొప్పవాడుగా చూపించడం కొంత మందికి నచ్చలేదు.


గత సినిమాల ప్రభావంతో కర్ణుడిని ఒక వీరుడిగానే చాలా మంది ఇండియన్స్ చూస్తారు. ఒరిజినల్ గా ఉన్న వ్యాస భారతంలో కర్ణుడి గురించి అంత గొప్పగా రాయబడి లేదు. అయితే దానిని స్టడీ చేసింది చాలా తక్కువ మంది. ఇదిలా ఉంటే కర్ణుడి పాత్రలో ప్రభాస్ ని మూవీ ఎండింగ్ లో రిప్రజెంట్ చేయడం అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.

ఆ సీన్ కి విజిల్స్ పడ్డాయి. కల్కి పార్ట్ 2లో కర్ణుడి పాత్రలో ప్రభాస్ ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కర్ణుడి లుక్ లో ప్రభాస్ ఎలా ఉండే బాగుంటాడో ఊహించుకొని ఫ్యాన్స్ డ్రాయింగ్స్ వేస్తున్నారు. అలాగే AI సహాయంతో ప్రభాస్ ని కర్ణుడి రూపంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా అలా డిజైన్ చేసిన ప్రభాస్ కర్ణుడి లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ లో ప్రభాస్ ని కర్ణుడిగా కల్కి పార్ట్ 2లో చూపించాలని నాగ్ అశ్విన్ ని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి అవతార్ లో ప్రభాస్ కనిపిస్తే పూనకాలు రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం కర్ణుడి పాత్రపై చాలా మంది నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో నాగ్ అశ్విన్ ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ విషయంలో పునరాలోచనలో పెడతాడేమో చూడాలి.

కర్ణుడి పాత్రని ప్రభాస్ పోషించడంతో ఫ్యాన్స్ మాత్రం ఆ క్యారెక్టర్ కి బలంగా కనెక్ట్ అయిపోయారు. ఇక మూవీ పార్ట్ 2లో అభిమన్యుడి క్యారెక్టర్ కూడా ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఆ పాత్రని ఎలా డిజైన్ చేస్తాడనేది వేచి చూడాలి. ఇక పార్ట్ 2 షూట్ ఇప్పటికే 60 శాతం ఫినిష్ అయినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.

Tags:    

Similar News

eac