ఇక ఆ గేట్లు కూడా ప్రభాస్ తెరిస్తే..
ఒకప్పుడు తెలుగు సినిమాలు ఇతర భాషలలో రీమేక్ కావడమే తప్ప డబ్బింగ్ అయ్యి సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ.
ఒకప్పుడు తెలుగు సినిమాలు ఇతర భాషలలో రీమేక్ కావడమే తప్ప డబ్బింగ్ అయ్యి సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ. నార్త్ ఇండియాలో అయితే తెలుగు సినిమాలకు అస్సలు మార్కెట్ లేదు. అలాంటి సమయంలో రాజమౌళి సృష్టించిన బాహుబలి తెలుగు సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చేలా చేసింది. బాహుబలి 2 అయితే నార్త్ లో కలెక్షన్ల సునామి సృష్టించింది.
బాహుబలి సిరీస్ ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ అదే రేంజ్ లో తన మార్కెట్ ని కొనసాగిస్తున్నారు. అతని ప్రతి సినిమా 400 నుంచి 500 కోట్ల వరకు చాలా ఈజీగా కలెక్ట్ చేయగలుగుతుంది. బాహుబలి తర్వాత తెలుగు స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ 2, హనుమాన్ సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అయి కలెక్షన్స్ అందుకున్నాయో అందరికి తెలిసిందే.
టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. ఇండియన్ సినిమాగా తెరకెక్కి హాలీవుడ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ ఇప్పటివరకు లేవని చెప్పాలి. ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని హాలీవుడ్ చిత్రాలు తెరకెక్కి హిట్ అయ్యాయి.
సౌత్ నుంచి హాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి చిత్రం కల్కి 2898ఏడీ అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 22 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచర్స్టిక్ కాన్సెప్ట్ మూవీ గా సిద్ధమవుతున్న కల్కి కథకి యూనివర్సల్ ఆప్పీల్ ఉంది. అందుకే ఇంగ్లీష్ వెర్షన్ తోపాటు ఇతర విదేశీ భాషలలో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా హాలీవుడ్ లో కూడా సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్ని ఇండియన్ సినిమాలకి హాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు 1000 కోట్ల కలెక్షన్ అనేది చాలా ఈజీ అయ్య ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువ మూవీకి కూడా హాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడి అవకాశం ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ క్రియేట్ చేసిన ప్రభాస్ కల్కి మూవీతో పాన్ వరల్డ్ స్థాయిలో సక్సెస్ అందుకొని ఇండియన్ సినిమాకి హాలీవుడ్ మార్కెట్ గేట్ వేగా మారుతాడేమో చూడాలి. ఇక ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఎలక్షన్స్ కారణంగా జూన్ 27కి షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే.