ప్రభాస్.. ఇదే సరైన టైమ్..

అయితే ఈ చిత్రంతో ప్రభాస్.. తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Update: 2024-06-22 13:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ.. జూన్ 27వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ప్రభాస్ క్యారెక్టర్ అండ్ రోల్ ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో ప్రభాస్ భైరవ గెటప్ లో ఓ రేంజ్ లో అలరించారు.

రీసెంట్ గా రిలీజైన రెండో ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టేశారు. చివర్లో పెద్ద రోబోతో ప్రభాస్ ఫైట్ కు రావడం హైలెట్ గా నిలిచింది. ప్రభాస్ డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. మరోవైపు, ప్రీ లూడ్ వీడియోస్ సినిమాను కచ్చితంగా చూడాలంతే అన్నట్లు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రంతో ప్రభాస్.. తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి ప్రభాస్ కు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చిపెట్టిన బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినీ ప్రియులను నిరాశపరిచాయి. కానీ కొన్ని చోట్ల వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఇక గత ఏడాది చివర్లో వచ్చిన సలార్ మూవీ.. మంచి హిట్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల అనుకున్నంత స్థాయిలో వసూళ్లు సాధించలేదు.

థియేటర్ ఫుల్ రన్ లో రూ.700 కోట్ల వసూళ్లకే పరిమితమైంది సలార్ మూవీ. అయితే ఇప్పుడు ప్రభాస్ తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని, అందుకు ఇదే సరైన టైమ్ అని చెబుతున్నారు సినీ పండితులు. రూ.1000 కోట్ల వసూళ్ల రికార్డులు బ్రేక్ చేయాల్సి ఉందని అంటున్నారు. అన్ని భాషల్లో ప్రభాస్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగ్ అశ్విన్.. ఈ సినిమాకు ఐదేళ్ల టైమ్ ను వెచ్చించారు. దీంతో ప్రభాస్ భారీ హిట్ కొట్టాల్సిందేనని చెబుతున్నారు.

అయితే ఇప్పటికే జరిగిన ప్రమోషన్స్ వల్ల మూవీపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ అయింది. దీంతో కల్కికి వసూళ్ల పరంగా ఎలాంటి ఢోకా లేదని చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ పై మూవీ రిలీజ్ అయ్యాక.. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ప్రపంచం అంచనాలకు మించి ఉంటే వేరే లెవెల్ వసూళ్లు రావడం పక్కా. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, ప్రభాస్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News