కథలలో వేరియేషన్… డార్లింగ్ సక్సెస్ ఫార్ములా

నెక్స్ట్ జపాన్, చైనీస్ భాషలలో కూడా కల్కి మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Update: 2024-07-31 04:26 GMT

ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. సలార్ మూవీ 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, కల్కి వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 1100 కోట్లు వసూళ్లు చేసి థియేటర్స్ లో కొనసాగుతోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్స్ 1200 కోట్ల వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ జపాన్, చైనీస్ భాషలలో కూడా కల్కి మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే బాహుబలి నుంచి ప్రభాస్ కెరియర్ పరంగా చూసుకుంటే సినిమా సినిమాకి కథల పరంగా వేరియేషన్ చూపిస్తూనే ఉన్నారు. ఒకే జోనర్ స్టోరీస్ ని టచ్ చేయడం లేదు. బాహుబలి మూవీ హిస్టారికల్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి రికార్డులు క్రియేట్ చేసింది. సాహో మూవీ కమర్షియల్ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధేశ్యామ్ ప్యూర్ లవ్ స్టోరీ కథతో తెరకెక్కింది. ఆదిపురుష్ మూవీ రామాయణం బేస్ చేసుకుని మైథాలజీ చిత్రంగా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.

అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. డార్లింగ్ ఫాన్స్ కి కూడా చాలా రోజుల తర్వాత సలార్ తో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందారు. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది కల్కి 2898ఏడీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ డార్లింగ్ ప్రభాస్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ హిస్టారికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కలగలిపిన కథాంశంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడం విశేషం.

నెక్స్ట్ మారుతి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్ లో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా పోలీస్ స్టోరీతో కథాంశంతో స్పిరిట్ మూవీ ప్రభాస్ చేయబోతున్నాడు. డార్లింగ్ కెరియర్ లోనే ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో కంప్లీట్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో మూవీ చేయనున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్నాడు. ప్రభాస్ నుంచి రాబోయే ఈ మూడు సినిమాలు కూడా భిన్నమైన కథలు, జోనర్ ల ఉండబోతున్నాయి. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ కథలు చేయడం వలనే డార్లింగ్ ప్రభాస్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్టార్ గా తనదైన బ్రాండ్ తో దూసుకుపోతున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. మిగిలిన హీరోలు అందరూ కూడా సేఫ్ జోన్ లో మూవీస్ చేస్తుంటే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఉన్నా కూడా ప్రయోగాత్మక కథలకు పెద్దపీట వేయడం విశేషం.

Tags:    

Similar News