నటన కోసమే పుట్టిన హీరో అతను!
ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే డార్లింగ్ పై ప్రేమ కురిపించేది ఎంతో మంది.
డార్లింగ్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అతనంటే అందరికీ ఇష్టమే. అంతా ఎంతో ప్రేమతో అభిమానిస్తారు. ఇది అభిమానుల వెర్షన్. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే డార్లింగ్ పై ప్రేమ కురిపించేది ఎంతో మంది. అతడితో పనిచేసిన హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లు అంతా డార్లింగ్ ని ఎంతో అభిమానిస్తారు. సెట్ లో అతడు నడుచుకునే విధానం పట్ల, పాజిటివ్ విటీ పట్ల ఎంతో గొప్పగా చెబుతుంటారు.
ఇంతవరకూ డార్లింగ్ పై ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. ఇక వివాదాలకు తానెప్పుడు దూరమే. ఉంటే షూటింగ్ సెట్ లో ఉంటాడు. లేదంటే ఇంట్లో ఉంటాడు. మంచి పుడీ కాబట్టి! తనతో పాటు చుట్టూ ఉన్నవారికి కూడా పుల్లుగా పెడుతుంటాడు. ఇక నటన పరంగా డార్లింగ్ ని రాజమౌళి ఎంతగా అభిమాని స్తారో తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో గెస్ట్ రోల్ ఇవ్వాలని రాజమౌళికి అనిపించలేదా? అని డార్లింగ్ అంటే 'నువ్వో షిప్ అని..ఆ షిప్ ని పడితే పెడతాం..అనవసరంగా ఆపెద్ద షిప్ ని తీసుకొచ్చి పెట్టడం భావ్యం కాదంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు' జక్కన్న.
ఈ నేపథ్యంలో తాజాగా పాన్ ఇండియా మేకర్ ప్రశాంత్ నీల్ కూడా డార్లింగ్ పై మనసులో మాటని బయట పెట్టాడు. ప్రభాస్ కేవలం నటన కోసం మాత్రమే పుట్టిన నటుడటంటూ కితాబిచ్చాడు. తానో డిఫరెంట్ యాక్టర్ అని...యాక్షన్ కథలు అతనికి సెట్ అయినట్లు మరో నటుడికి అంత ఈజీగా సెట్ అవ్వవు అని అన్నారు. `సలార్` కథని ముందుగా ఎలాంటి స్టార్ ఊహలోకి రాకుండా మొదలు పెట్టినా తర్వాత ఇందులో ప్రభాస్ లాంటి హీరో మాత్రమే బాగుంటాడు? అన్న ఆలోచన వచ్చిందన్నాడు.
ఇక ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సలార్ సీజ్ ఫైర్' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రమిది. దీంతో `సలార్ -2`పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉన్నారు.