ప్రగ్యా సర్‌ప్రైజింగ్‌ అందాల షో

కంచె సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆ సినిమాలో ప్రగ్యా అందానికి, నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Update: 2024-09-02 11:03 GMT

తమిళ చిత్రం 'విరాటు' తో 2014లో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రగ్యా జైస్వాల్‌ తెలుగు లో కూడా అదే టైమ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో మొదటి సినిమా మిర్చి లాంటి కుర్రాడు సినిమా నిరాశ పరిచింది. మొదటి సినిమా నిరాశ పరచినా కూడా 'కంచె' సినిమాలో నటించే అవకాశం ప్రగ్యాకు వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమాలో మెగా హీరో వరుణ్‌ తేజ్ కి జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించింది. ఆ సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్‌ లో ఫేమస్ అయ్యింది. కంచె సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆ సినిమాలో ప్రగ్యా అందానికి, నటనకు మంచి మార్కులు పడ్డాయి.


కంచె సినిమా తర్వాత టాలీవుడ్‌ లో ప్రగ్యా వరుసగా ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఆమె ఎత్తు టాలీవుడ్‌ లో ఉన్న చాలా మంది యంగ్‌ హీరోల కంటే కాస్త ఎక్కువగానే ఉంది. దాంతో ప్రగ్యా తో నటించేందుకు చాలా మంది ఆసక్తి చూపించలేదు. కంచె తర్వాత ఆమె చేసిన సినిమాలు కొన్ని పర్వాలేదు అనిపించుకోగా, ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. బాలయ్యకు జోడీగా నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో ఈమెకు ఆఫర్లు రాలేదు.

సినిమాల్లో ఆఫర్లతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో ఈమె అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అన్ని భాషల నెటిజన్స్‌ ప్రగ్యా జైస్వాల్‌ యొక్క అందమైన ఫోటోలకు ఫిదా అవుతూ ఉంటారు. నెట్టింట ఆమె షేర్‌ చేసే ఫోటోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరోసారి ప్రగ్యా జైస్వాల్‌ అందమైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈసారి లేత గోధుమ రంగు లో ప్రగ్యా సర్‌ప్రైజింగ్‌ అందాల షో కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉన్నా కూడా పాపం ప్రగ్యా జైస్వాల్‌ కు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు, రావాల్సిన ఆఫర్లు రావడం లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అఖండ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఈ అమ్మడు బాలకృష్ణ తో మరోసారి నటిస్తోంది. బాలకృష్ణ, బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా ప్రగ్యా కనిపించబోతుందనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. సినిమా టైటిల్‌ ను ప్రకటించిన సమయంలో ప్రగ్యా పాత్ర గురించి మేకర్స్‌ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య 109వ సినిమాను ఇదే ఏడాది డిసెంబర్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. బాలయ్య సినిమా వచ్చిన తర్వాత అయినా ప్రగ్యాకు మళ్లీ వరుస ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News