ప్రగ్యా స్టన్నింగ్ బికినీ.. ఇలా ఎప్పుడైనా చూశారా..

ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్‌లో తన అందం, నటనతో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

Update: 2024-09-26 20:30 GMT

ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్‌లో తన అందం, నటనతో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కానీ ఆమె కెరీర్ లో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ, ఆమెకు సరైన క్రేజ్ అందలేదని స్పష్టంగా తెలుస్తోంది. 2015లో కంచే సినిమా ద్వారా బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రగ్యా, ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది, అలాగే అవార్డులు కూడా అందించింది. అయితే, ఆమెకు ఆ తర్వాతి సినిమాల్లో అదే స్థాయి విజయాలు అందలేకపోయాయి. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, ఆమెకు సరైన బ్రేక్ మాత్రం అందలేదు. 2021లో బాలకృష్ణతో చేసిన అఖండ సినిమా ఆమె కెరీర్‌కు మరోసారి బూస్ట్ ఇచ్చింది.

ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ, ఆమెకు తరువాత పెద్దగా అవకాశాలు లభించలేదు. ముఖ్యంగా సన్నాఫ్ ఇండియా వంటి సినిమాలు విజయవంతం కాకపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రగ్యా కెరీర్‌లో వచ్చిన ఫ్లాపులు ఆమె గ్లామర్ క్రేజ్ ను మాత్రం ఏ విధంగానూ తగ్గించలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్లలో, సోషల్ మీడియాలో ఆమె తన అందంతో ఫాలోవర్స్ ను ఆకర్షిస్తోంది.

రీసెంట్‌గా ఆమె బికినిలో స్టైలిష్ లుక్ తో సరికొత్త గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ "ప్రగ్యా అందంలో ఏం తక్కువ" అని ప్రశంసిస్తూ, ఆమెకు సరైన బ్రేక్ వస్తే టాప్ లిస్ట్ లో ఉండేది అని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, తమిళంలో మరియు బాలీవుడ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఆమెకు అవకాశాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్‌లో ఒక హిందీ సినిమా ప్రాజెక్ట్ చేస్తోందట, అలాగే తమిళంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News