చీరందంలో ఆ బ్యూటీ పేపంరింగ్ త‌గ్గేదేలే!

ఇక పొడ‌వైన చెవులీలు సంథింగ స్పెష‌ల్ గా హైలైట్ అవుతున్నాయి. చీరందాన్ని మ్యాచ్ చేస్తూ ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది ప్ర‌గ్యా బ్యూటీని అంత‌కంత‌కు రెట్టింపు చేస్తుంది.

Update: 2024-04-26 05:21 GMT

బాలీవుడ్ బ్యూటీ ప్ర‌గ్యాజైశ్వాల్ నెట్టింట యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చేతిలో సినిమాలు లేక‌పోయినా! అదే క్రేజ్ మెయింటెన్ చేస్తోంది అంటే నెటిజ‌న‌ల్లో ఆ బ్యూటీకి ఉ న్న ఫాలోయింగే కార‌ణం. ఎప్ప‌టిక‌ప్పుడు న్యూ డిజైన్స్ లో యువ‌త‌ని ఆక‌ర్షించ‌డం ప్ర‌గ్యా ప్ర‌త్యేక‌త‌. కాంపిటీష‌న్ ఎంత ఉన్నా! ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రి ఎప్పుడూ ప్రూవ్ చేస్తూనే ఉంటుంది. న్యూడిజైన్స్ లో ట్రెండ్ ని సెట్ చేయాల‌ని ప్ర‌తీసారి ప్ర‌య‌త్నిస్తుంటుంది. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి చీరందంలో త‌ళుకులీనింది.

 

ఇదిగో ఇక్క‌డిలా ప్ల‌వ‌ర్ డిజైన్ సాధార‌ణ‌ సారీలో అమ్మ‌డి మురిపిం మామూలుగా లేదు. మ్యాచింగ్ ర‌విక ద‌రించి ఆహా అంద‌మంతా ఆమె సొంత‌మ‌నిపించింది. అమ్మ‌డి మ్యాక‌ప్...స్కిన్..ముఖంలో అంద‌మైన చిరున‌వ్వు తో కుర్ర‌కారుని ఆక‌ర్షిస్తుంది.

 

ఇక పొడ‌వైన చెవులీలు సంథింగ స్పెష‌ల్ గా హైలైట్ అవుతున్నాయి. చీరందాన్ని మ్యాచ్ చేస్తూ ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది ప్ర‌గ్యా బ్యూటీని అంత‌కంత‌కు రెట్టింపు చేస్తుంది. వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఇచ్చిన ఫోజులు యువ‌త‌ని ఆక‌ర్షిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్ర‌గ్యా అందాన్ని పొగిడేస్తూ అభిమానుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం.

 

ఇక ప్ర‌గ్యాజైశ్వాల్ కెరీర్ ఎలా సాగుతుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. స్టార్ హీరోయిన్ అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా? ఆ రేంజ్ కి ఇంకా చేర‌లేదు. సెకెండ్ లీడ్స్ తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తోంది. ఆ అవ‌కాశాలు కూడా పెద్ద‌గా రావ‌డం లేదు. తెలుగులో ప్ర‌స్తుతాన‌కైతే ఛాన్సులే లేవ‌ని చెప్పాలి. అఖండ విజ‌యం త‌ర్వాత బిజీ అవుతుంద‌నుకుంటే అది జ‌ర‌గ‌లేదు. స‌న్నాఫ్ ఇండియాతో వెంట‌నే మ‌రో ప్లాప్ ప‌ల‌క‌రించింది.

 

అయితే త‌న తొమ్మిదేళ్ల క్రితం నాటి క‌ల నిజ‌మ‌య్యే మ‌రో అవ‌కాశం అందుకుంది. అక్ష‌య్ కుమార్ ..తాప్సీ ..వాణీ క‌పూర్ న‌టిస్తోన్న `ఖేల్ ఖేల్ మే` అనే హిందీ చిత్రంలో ప్ర‌గ్యా అవ‌కాశం అందుకుంది. ఇందులో అమ్మ‌డు ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. అక్ష‌య్ కుమార్ తో పోటా పోటీ స‌న్నివేశాలున్నాయ‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని ముదస్స‌ర్ అజీజ్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇది ఓ ఇటాలియ‌న్ సినిమా కి రీమేక్ గా రూపొందుతుంది.

Tags:    

Similar News