ప్రకాష్ రాజ్ అభిమాన హీరో ఎవరో తెలుసా...!
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా కు మంచి స్పందన దక్కింది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా కు మంచి స్పందన దక్కింది. సినిమా భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు భారీ ఎత్తున సినిమా సక్సెస్ వేడుక తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఓపెన్ ప్లేస్ లో నిర్వహించాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. అందుకే సినీ ప్రముఖులకు సక్సెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణ సంస్థ నిర్వహించిన సక్సెస్ పార్టీ లో రాజమౌళి మొదలుకుని పలువురు సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు, ఇతర నటీ నటులు పాల్గొన్నారు.
దేవర సినిమాలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రదర్శించారు అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రెండు పాత్రల్లోనూ ఒదిగి పోయి కనిపించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. తాజాగా జరిగిన దేవర సక్సెస్ పార్టీలోనూ సెలబ్రెటీలు, యూనిట్ సభ్యులు అంతా ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ నటనతో పాటు కొరటాల శివ టేకింగ్ కారణంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ అతిథులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సక్సెస్ పార్టీ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... ఈ సినిమా లో నాకు నచ్చిన విషయం శివ చెప్పిన ఐడియా ను నమ్మి తారక్ ఓకే చెప్పడం. తనకు తారక్ అంటే చాలా ఇష్టం, అభిమానం, నేను ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని చెబుతున్నాను అన్నారు. ఆస్కార్ ఫంక్షన్ లో ఎంతో మంది దిగ్గజాల ముందు తారక్ నిలబడి మాట్లాడుతూ ఉంటే తాను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఎంతో గర్వపడ్డాను అంటూ ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ సినిమా కోసం తారక్ చాలా కష్టపడ్డారు. అంతే కాకుండా దర్శకుడు కొరటాల శివ కు తారక్ అండగా నిలబడ్డారు. నేను ఎప్పుడూ తెలుగు హీరోల్లో నాకు ఇష్టమైన హీరోలు ఉంటే అది తారక్ అని అంటూ ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా కు అనిరుద్ సంగీతాన్ని అందించగా నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని లు దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ పంపిణీ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన దేవర సినిమాకు ఇప్పటి వరకు దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి రూ.500 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ముందు నుంచే అనుకుంటున్న ఫ్యాన్స్ కి ఈ కలెక్షన్స్ చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దేవర సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు. లాంగ్ రన్ లో రూ.600 కోట్ల వసూళ్లను దేవర దక్కించుకుంటుందేమో చూడాలి.