గ్లామరస్ పైలట్ టు హీరోయిన్.. కుర్రాళ్లు ఫ్లాట్!
మరికొందరు బ్యూటీలు.. కొన్ని సినిమాలు చేశాక ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వస్తుంటారు.
సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎందరో బ్యూటీలు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో చాలా మంది తొలి సినిమాతో హిట్ కొడుతుంటారు. వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంటారు. తమదైన శైలిలో మెప్పిస్తూ అభిమానులను సొంతం చేసుకుని సత్తా చాటుతుంటారు. మరికొందరు బ్యూటీలు.. కొన్ని సినిమాలు చేశాక ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వస్తుంటారు. అలా వచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు.
అయితే అనేక మంది హీరోయిన్లు.. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేస్తుంటారు. కొందరు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుని హీరోయిన్ గా ఛాన్సులు దక్కించుకుంటారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తుంటారు. ఈమధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కు సంబంధం లేని రంగాల నుంచి కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. డాక్టర్స్, ఆర్కిటెక్స్ తమ యాక్టింగ్ తో సత్తా చాటుతున్నారు.
తాజాగా ఓ పైలట్ హీరోయిన్ గా మారనుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తన డెబ్యూ మూవీతో రానుంది. ఆమెనే ప్రార్థనా ఛాబ్రియా. ఇప్పుడు అనేక భాషల్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రార్థన. వరుస అవకాశాలు దక్కించుకునేందుకు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో అలరిస్తోంది. లేటెస్ట్ గా వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో అందాలు ఆరబోసింది.
అయితే ఇండస్ట్రీలో ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ప్రార్థన అందాల విందు అదిరిపోయిందని అంటున్నారు. గ్లామరస్ పైలట్ అంటూ ఆమె పిక్స్ ను రీ షేర్ చేస్తున్నారు. అమ్మడి అందానికి ఫ్లాట్ అయ్యామని చెబుతున్నారు. నెట్టింట అంతా ఆమె కోసమే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇంకా ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మంచి ఫాలోవర్స్ సంపాదించుకుంటోంది ప్రార్థన. మేకర్స్ దృష్టిని ఆకర్షించడానికి ట్రై చేస్తోంది.
ఇక ఆమె డెబ్యూ మూవీని విషయానికొస్తే.. వివేక్ రాజారామ్ తెరకెక్కిస్తున్న 'చిరో' సినిమాలో యాక్ట్ చేస్తోంది ప్రార్థన. మిలియన్ స్డూడియోస్ బ్యానర్ పై ఎంఎస్ మంజూర్ నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మూవీ అంతా ఒకే జోనర్ లో ఉండదని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు వినికిడి. మరి ఫస్ట్ మూవీతో అందాల పైలట్ కమ్ హీరోయిన్ ప్రార్థన ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.