సలార్‌ : డార్క్ షేడ్‌ పై డైరెక్టర్‌ క్లారిటీ

ఆయన మాట్లాడుతూ... నాకు ఉన్న ఓసీడీ కారణంగా ఎక్కువ రంగులు వాడటం ఇష్టం ఉండదు.

Update: 2023-12-19 11:46 GMT

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ఉగ్రం, కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్ 2 లో ఎలాగైతే ఎక్కువగా డార్క్‌ షేడ్‌ సన్నివేశాలు ఉన్నాయో అలాగే మరో మూడు రోజుల్లో రాబోతున్న సలార్ లో కూడా డార్క్ షేడ్ సన్నివేశాలే అధికం. ఇప్పటి వరకు విడుదల అయిన పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్స్ ఇలా ప్రతి ఒక్కదాంట్లో కూడా డార్క్‌ షేడ్‌ నే దర్శకుడు ప్రశాంత్‌ నీల్ చూపించాడు.

సలార్ తర్వాత ఎన్టీఆర్‌ తో ప్రశాంత్‌ నీల్ తీయబోతున్న సినిమా కూడా ఇలాగే ఉంటుందని, ఇప్పటికే విడుదల అయిన ఒక ప్రీ లుక్ పోస్టర్‌ తో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెప్పకనే చెప్పాడు. కథ ఏదైనా కూడా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తాను డార్క్ షేడ్‌ లోనే చూపిస్తాను అంటూ ఆ తరహా లో చూపిస్తున్నాడు.

తాజాగా ప్రశాంత్‌ వర్మ 'సలార్‌' ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో డార్క్ షేడ్‌ సీక్రెట్‌ ను రివీల్ చేశాడు. ఆయన మాట్లాడుతూ... నాకు ఉన్న ఓసీడీ కారణంగా ఎక్కువ రంగులు వాడటం ఇష్టం ఉండదు. అందుకే నేను ఎక్కువగా బ్లాక్ థీమ్‌ లో సినిమాలు తీస్తూ ఉంటాను అంటూ ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చాడు.

వ్యక్తిగతంగా కూడా నేను ఎక్కువ కలర్‌ ఫుల్‌ డ్రెస్ లు వేసుకోను. నా సినిమాల్లో ఎక్కువ కలర్ ఫుల్‌ ఎలిమెంట్స్ చూపించాలని అనుకోను. నాచురల్‌ గా డార్క్ షేడ్‌ తోనే ఎక్కువగా సన్నివేశాలు చేస్తానంటూ ప్రశాంత్‌ నీల్‌ అన్నాడు. ముందు ముందు తాను చేయబోతున్న సినిమాలు కూడా డార్క్ షేడ్‌ తోనే ఉంటాయని చెప్పకనే చెప్పాడు.

Tags:    

Similar News