ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ విజువల్ ట్రీట్.. గెట్ రెడీ
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
‘హనుమాన్’ చిత్రంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన ప్రతిభావంతుడైన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా రాబోతున్న ఈ చిత్రం, విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ కట్టిపడేస్తోంది. ఈ పోస్టర్‌లో ఆంజనేయుడు ఓ పాత ఆలయం వైపు అడుగులు వేస్తున్న సన్నివేశం చూడగానే భక్తులకు కళ్ళలో ఆనందం నింపుతోంది. ఈ పోస్టర్‌తో సినిమా విషయంలో మరింత ఆత్రుత రేకెత్తగా, రేపు దీపావళి పండగకు ముందుగా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అప్‌డేట్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో హనుమాన్ పాత్రను ఎవరు పోషించనున్నారు అనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అనేక పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నా, ఫైనల్ గా ఏ హీరో ఆ పాత్రలో మెరవనున్నారన్నది రేపటి ఫస్ట్ లుక్‌తో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ప్రత్యేకమైన స్టైల్‌తో ఆంజనేయుడిని కొత్తగా తీర్చిదిద్దనున్నారు.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాంకేతిక పరంగా అత్యంత నాణ్యతతో రూపొందించే దృశ్యాలు, సినిమా ప్రమాణాలు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా మేకింగ్ విషయంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయనున్నారట. ప్రేక్షకులకు అంతకుమించిన విజువల్ ట్రీట్ అందించడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
‘జై హనుమాన్’ సినిమాను తప్పకుండా మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ప్రమోట్ చేయగలదని చెప్పవచ్చు. ఇక ప్రతిభావంతులైన ప్రత్యేక బృందంతో పని చేయడంతో అవుట్ ఫుట్ హై రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. సినిమా సన్నివేశాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో మేకర్స్ తీసుకున్న కసరత్తు చూస్తుంటే PVCU ట్రాక్ లో ఈ చిత్రం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించనుందని అర్థమవుతోంది. ఇక సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో కూడా మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.