చరణ్ తో సినిమా కొన్ని సార్లు చేయక తప్పదు!

తమిళంలో స్టార్‌ హీరో అయిన ప్రశాంత్‌ ను ఎలా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకు ఒప్పించి ఉంటాడు అనే చర్చ కూడా అప్పుడు జరిగింది.

Update: 2024-08-08 02:45 GMT

రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో తమిళ స్టార్ నటుడు ప్రశాంత్‌ కీలక పాత్ర లో నటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. చరణ్ కు అన్న పాత్రలో ప్రశాంత్‌ ను చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. జీన్స్‌, జోడీ సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ అయిన ప్రశాంత్‌ చాలా కాలం తర్వాత చరణ్‌ కు అన్న పాత్ర లో వినయ విధేయ రామ సినిమాలో నటించడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది.

తమిళంలో స్టార్‌ హీరో అయిన ప్రశాంత్‌ ను ఎలా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకు ఒప్పించి ఉంటాడు అనే చర్చ కూడా అప్పుడు జరిగింది. తాజాగా ప్రశాంత్‌ ఆ విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం 'అంధగన్‌' విడుదలకు రెడీ అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ లో చేసిన కొన్ని ఆసక్తికర సినిమాల గురించి స్పందించాడు. ఆ సమయంలోనే వినయ విధేయ రామ సినిమాలో నటించడం పై స్పందించాడు.

ప్రశాంత్‌ మాట్లాడుతూ.. నేను ఎక్కువ శాతం మా సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ ఉంటాను. వేరు బ్యానర్‌ లో సినిమాలో సినిమాలు చేసి ఆ నిర్మాతలను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఫలితం ఏదైనా కూడా మా సొంత బ్యానర్‌ కనుక ఇబ్బంది లేదు అనుకునే మనస్థత్వం నాది. చిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన వారు నిర్మాతలు. కనుక వారి మనుగడ, వారి శ్రేయస్సు ముఖ్యం అని నేను భావిస్తాను. అందుకే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. వేరే బ్యానర్‌ లో సినిమా చేస్తే ఆ నిర్మాతకు అండగా ఉండాలి అనుకుంటాను అన్నాడు.

తెలుగు లో అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ చరణ్ నాకు చాలా కాలంగా పరిచయం, అలాగే అతడితో ఉన్న స్నేహం కారణంగా కలిసి నటించేందుకు ఒప్పుకున్నాను. వినయ విధేయ రామ సినిమాలో నేను పోషించిన పాత్రకు పూర్తి న్యాయం చేశాను అని భావిస్తాను. ఎక్కువ మా సొంత బ్యానర్ లో సినిమాలు చేయాలని అనుకున్నా కూడా కొన్ని సార్లు ఏవో కారణాల వల్ల ఇతర హీరోల సినిమాల్లో, ఇతర నిర్మాతల బ్యానర్ ల్లో సినిమాలు చేయాల్సి ఉంటుంది అంటూ ప్రశాంత్‌ చెప్పుకొచ్చాడు.

వినయ విధేయ రామ సినిమాలో రామ్‌ చరణ్ తో బోయపాటి చేయించిన యాక్షన్ సన్నివేశాలకు విమర్శలు ఏ స్థాయిలో వచ్చాయో తెల్సిందే. ఇక చరణ్ కు అన్నలుగా నటించిన వారిని మరీ డమ్మీలుగా చూపించాడు అంటూ కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. అలాంటి డమ్మీ పాత్రను తమిళ స్టార్‌ నటుడు అయిన ప్రశాంత్‌ ఎలా ఒప్పుకుని ఉంటాడు అంటూ అప్పుడు చాలా మంది కామెంట్స్ చేశారు. కథ చెప్ప సమయంలో బోయపాటి వేరేది చెప్పి, షూట్‌ చేసే సమయంలో మార్చి ఉంటాడేమో అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తానికి తెలుగు లో ప్రశాంత్‌ మళ్లీ నటించాలంటే భయపడే విధంగా వినయ విధేయ రామ సినిమా ఫలితం ఉందనే మీమ్స్ వచ్చాయి.

Tags:    

Similar News