'జీన్స్' ప్ర‌శాంత్ కెరీర్ టేకాఫ్ లేన‌ట్టేనా?

ఇత‌ర సీనియ‌ర్ల బాట‌లో ప్ర‌శాంత్ తెలుగు సినిమా కెరీర్ ప్ర‌య‌త్నం అలా విఫ‌ల‌మైంది.

Update: 2024-08-08 20:30 GMT

ప్ర‌శాంత్ త‌మిళ చిత్ర‌సీమ‌లో అగ్ర క‌థానాయ‌కుడు. అత‌డి తండ్రి త్యాగ‌రాజ‌న్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో జీన్స్ లాంటి క్రేజీ చిత్రంలోను ప్ర‌శాంత్ ద్విపాత్రాభిన‌యంతో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఎందుక‌నో అత‌డి కెరీర్ ఆశించిన రేంజుకు చేరుకోలేదు. త‌మిళ చిత్ర‌సీమ సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డిగా అత‌డు ఎద‌గ‌లేక‌పోయాడు.

కొన్నేళ్ల క్రితం ప్ర‌శాంత్ టాలీవుడ్ లో 'విన‌య విధేయ రామ' చిత్రంలో స‌హాయ‌క పాత్ర‌లోను న‌టించాడు. బోయ‌పాటి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. కానీ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డం నిరాశ‌ప‌రిచింది. ఇత‌ర సీనియ‌ర్ల బాట‌లో ప్ర‌శాంత్ తెలుగు సినిమా కెరీర్ ప్ర‌య‌త్నం అలా విఫ‌ల‌మైంది. అదంతా అటుంచితే ప్ర‌శాంత్ ఇప్ప‌టికీ త‌మిళంలో మెయిన్ స్ట్రీమ్ క‌థానాయ‌కుడిగా కొన‌సాగుతున్నాడు. రీమేక్ చిత్రాల‌తోను సంద‌డి చేస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయి స‌క్సెస్ మాత్రం క‌నిపించ‌డం లేదు.

ఇప్పుడు 2018లో విడుదలైన అంధాధున్ త‌మిళ రీమేక్ లో అత‌డు న‌టించాడు. ఇది హిందీలో అత్యుత్తమ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌లలో ఒకటిగా రికార్డుల్లో నిలిచింది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ చిత్రంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత తెలుగులో మాస్ట్రోగా, మలయాళంలో భ్రమమ్‌గా, ఇప్పుడు తమిళంలో ప్ర‌శాంత్ హీరోగా `అంధగన్‌` పేరుతో రీమేక్‌ చేశారు. ఈ తమిళ చిత్రం ఈ శుక్ర‌వారం థియేటర్లలో విడుదల కానుంది. 2019లో ప్రకటించిన చిత్రం దాదాపు ఐదేళ్ల త‌ర్వాత విడుద‌ల‌వుతోంది. దీంతో మూవీపై బ‌జ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. చాలా ఆలస్యాల తర్వాత చివరకు 2024లో విడుదలవుతోంది. కార‌ణం ఏదైనా కానీ ఈ రీమేక్ మూవీకి ప్రీ-రిలీజ్ బ‌జ్ నామ‌మాత్రమేన‌ని త‌మిళ ట్రేడ్ చెబుతోంది. థియేటర్లలో విడుద‌ల‌య్యాక పనితీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌శాంత్ చాలా హోప్స్ తో న‌టించిన ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో వేచి చూడాలి.

ప్ర‌శాంత్ తండ్రి త్యాగరాజన్ దర్శకత్వం వహించిన అంధగన్‌లో సిమ్రాన్, ప్రియా ఆనంద్, కార్తీక్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్టార్ మూవీస్ నిర్మించింది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

ప్ర‌శాంత్ కెరీర్ జర్నీ:

హీరో ప్ర‌శాంత్ కూడా ఇత‌రుల్లానే డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యాడు. తన తండ్రి టి. త్యాగరాజన్ అనుస‌రించిన బాట‌లోనే సినిమా నిర్మాత అయ్యాడు. ప్రశాంత్ త‌న తండ్రి సినిమాల‌కు మేనేజర్ గాను అనుభ‌వం ఘ‌డించాడు. కాల‌క్ర‌మంలో నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. అతడు 17 సంవత్సరాల వయస్సులో `వైకాసి ప్రాంతం` (1990) చిత్రంతో న‌టుడ‌య్యాడు. మొదటి హిట్ దొంగ దొంగ (1993).. చివరకు 1998లో శంకర్ దర్శకత్వం వహించిన జీన్స్ అత‌డికి మంచి గుర్తింపును తెచ్చింది.

ప్రశాంత్ త‌మిళం, తెలుగు, హిందీ, మలయాళ చిత్రాలలో న‌టించాడు. బాలు మహేంద్ర `వన్న వన్న పూక్కల్` (1992), R. K. సెల్వమణి చెంబరుతి (1992), తొలి ముద్దు (1993), తిరుడా తిరుడా (1993-మ‌ణిర‌త్నం) చిత్రాలు అత‌డి కెరీర్ లో విజ‌య‌వంత‌మైన చిత్రాలుగా నిలిచాయి.

Tags:    

Similar News