ఎన్టీఆర్ - నీల్ మూవీ కొత్త అప్డేట్!
ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఆసక్తికర ప్రకటన చేయడం జరిగింది
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ను చేస్తున్నాడు. మరో వైపు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్ దశలో ఉండగానే కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కబోతుంది.
ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఆసక్తికర ప్రకటన చేయడం జరిగింది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీని ఆగస్టు నుంచి పట్టాలెక్కించబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ప్రస్తుతం సలార్ 2 చేస్తున్న ప్రశాంత్ నీల్ నిజంగానే ఆగస్టు లో ఎన్టీఆర్ సినిమా మొదలు పెట్టేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్ దేవర మరియు వార్ 2 సినిమా ల షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకు డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశ పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులు ఫైనల్ వర్షన్ స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొన్నారని సమాచారం అందుతోంది.
డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను నెగటివ్ షేడ్స్ లో చూపించబోతున్నాడని కూడా సమాచారం అందుతోంది. కేజీఎఫ్ మరియు సలార్ సినిమాల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ స్థాయి కూడా అమాంతం పెరిగింది. అందుకే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని నెలకొంది. ఏకంగా వెయ్యి కోట్ల టార్గెట్ తో ఈ సినిమా రాబోతున్నట్లుగా ఇప్పటి నుంచే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.