50 ఏళ్ల‌కి రెండో పెళ్లి అంటే సిగ్గుప‌డిన హీరో!

కోలీవుడ్ న‌టుడు ప్ర‌శాంత్ సుప‌రిచిత‌మే. `జీన్స్` సినిమాతో తెలుగింట బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాలతో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు

Update: 2024-08-19 05:24 GMT

కోలీవుడ్ న‌టుడు ప్ర‌శాంత్ సుప‌రిచిత‌మే. `జీన్స్` సినిమాతో తెలుగింట బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాలతో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. జీన్స్ కంటే ముందు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కొన్ని చేసాడు. `లాఠీ`, `ప్రేమ‌శిఖ‌రం`, `తొలిముద్దు` లాంటి చిత్రాల్లో న‌టించాడు. ఆ మ‌ధ్య మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `విన‌య విధేయ రామ‌`లో అన్న‌య్య పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

ఇలా కెరీర్ ప‌రంగా సినిమాలు బాగానే చేస్తున్నాడు. అయితే 2019 నుంచి మాత్రం ఖాళీగానే ఉంటున్నాడు. మ‌ళ్లీ ఈ మ‌ధ్య‌నే న‌టుడిగా కంబ్యాక్ అయ్యాడు. `అంధ‌గన్` సినిమాతో కంబ్యాక్ అవుతున్నాడు. అలాగే త‌ల‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

అయితే ప్ర‌శాంత్ వ్య‌క్తిగ‌త జీవితం మాత్రం అంత సాఫీగా సాగ‌లేదు. 2005 లో గృహ‌ల‌క్ష్మి తో వివాహ‌మైంది. కానీ కాపురం ఎంతో కాలం నిల‌వ‌లేదు. నాలుగేళ్ల అనంత‌రం మ‌న‌స్ప‌ర్ద‌ల కార‌ణంగా విడిపోయారు. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ రెండ‌వ పెళ్లిపై ఆస‌క్తి చూపించ‌లేదు. సింగిల్ ఉంటూనే ప్రోఫెష‌న‌ల్ గానే కొనసాగాడు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌య‌సు 51 ఏళ్లు. అయితే ఇప్పుడిత‌డికి మ‌ళ్లీ పెళ్లిపై మ‌న‌సు లాగింది.

ప్ర‌శాంత్ రెండ‌వ పెళ్లి చేసుకుంటున్నాడ‌ని అత‌డి తండ్రి త్యాగ‌రాజ్ `అంధ‌గన్` సినిమా ఈవెంట్లో రివీల్ చేసారు. వ‌ధువు గురించి వెతుకున్నామ‌ని, త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ చెబుతాం అన్నారు. ఆ స‌మ‌యంలో ప్ర‌శాంత్ తండ్రి ప‌క్క‌నే ఉన్నాడు. పెళ్లి విష‌యం చెప్ప‌గానే ప్ర‌శాంత్ కాస్త సిగ్గుప‌డ్డాడు. మ‌న‌సులో న‌వ్వు కున్నాడు.

Tags:    

Similar News