హనుమాన్ కోసం చిరంజీవి.. రుణపడి ఉంటానన్న డైరెక్టర్..!

అ! సినిమా నుంచి తన ప్రతిభతో మెప్పిస్తూ వస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లేటెస్ట్ గా తేజా సజ్జ తో హనుమాన్ సినిమా చేశారు.

Update: 2024-01-08 04:59 GMT

అ! సినిమా నుంచి తన ప్రతిభతో మెప్పిస్తూ వస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లేటెస్ట్ గా తేజా సజ్జ తో హనుమాన్ సినిమా చేశారు. నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈవెంట్ లో డైర్క్టర్ ప్రశాంత్ వర్మ స్పీచ్ ప్రేక్షకులను అలరించింది.

హనుమాన్ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాకు అందరికన్నా ముందు నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన మొదటి నుంచి ఈ సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. ప్రతి డైరెక్టర్ కి ఇలాంటి నిర్మాత దొరికితే బాగుంటుందని అన్నారు.

సినిమా తీయడం అంటే మేకింగ్ వీడియో చూపించినట్టుగా సరదాగా ఏమి ఉండదు. ఎంతో కష్టపడి ఫైట్ చేసి ఒక యుద్ధం చేసినట్టుగా ఉంటుందని అన్నారు. తను సూపర్ టాలెంటెడ్ ఏడాదిలో డైరెక్టర్ అవుతానని నాన్నకు చెప్పాను.. కానీ 12 ఏళ్లు పట్టింది. ఈ ప్రయాణంలో తేజా ఉన్నాడు. తేజాకి చాలా థాంక్స్ అని అన్నారు ప్రశాంత్ వర్మ.

నేనే ఎక్కువ సినిమాల గురించి ఆలోచిస్తా అంటే నాకన్నా ఎక్కువ సినిమాల గురించి ఆలోచిస్తాడు తేజ. నిద్రలో కూడా సినిమా ధ్యాస ఉంటుందని అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ కు థాంక్స్. వాళ్ల ఫ్యామిలీస్ ని వదిలి ఈ సినిమా కోసం 3 ఏళ్లుగా పనిచేశారు. సినిమా వాళ్లంటే చిన్నచూపు ఉంటుంది దాన్ని పక్కన పెట్టి ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తుంటారు.

సినిమా తీయడం కన్నా ఈ టైం లో రిలీజ్ చేయడం చాలా కష్టం. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక్కడినే నేనేమి చేయలేను కదా అని అంటే ధర్మం కోసం పోరాడితే వారి వెనుక హనుమంతుడు ఉంటాడు. మా సినిమాకు అలా వచ్చిన హనుమంతుడు మెగాస్టార్ చిరంజీవి. చిరు సపోర్ట్ ని సరైన టైం లో వాడుకోవాలని అనుకున్నాం అది హనుమాన్ కి కుదిరిందని అన్నారు.హనుమాన్ కి సపోర్ట్ చేసిన చిరంజీవి గారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని అన్నారు ప్రశాంత్ వర్మ.

చిన్నప్పుడు పాలకొల్లులో చిరంజీవి కటౌట్ లకు పాలతో అభిషేకం చేయడం చూస్తూ పెరిగా.. ఇప్పుడు ఆయన ముందు ఇలా మాట్లాడటం సంతోషంగా ఉందని అన్నారు ప్రశాంత్ వర్మ.

మనకు ఫాంటసీ సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేది జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ బ్లాక్ బస్ట సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి సినిమా వస్తుంది. ఈ ఈ సంక్రాంతికి అందరు కలిసి చూసేలా హనుమాన్ వస్తుంది. ఇది హనుమంతుడు కథ కాదు.. మాములు మనిషికి శక్తులు వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నామని అన్నారు ప్రశాంత్ వర్మ.

Tags:    

Similar News